»   » పవన్ కళ్యాణ్ తాజా చిత్రం టైటిల్ వివాదం కానుందా?

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం టైటిల్ వివాదం కానుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కళ్యాణ్ తాజా చిత్రానికి నిర్మాత గణేష్..."పవన్ కళ్యాణ్ లవ్ లీ" అనై టైటిల్ ని రిజిస్టర్ చేసారు. దాంతో లవ్ లీ అనే టైటిల్ పెట్టకుండా పవన్ కల్యాణ్ లవ్ లీ అని పెట్టడంతో ఇదిమరో టైటిల్ వివాదానికి దారితీస్తుందా అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే లవ్ లీ అని పెట్టకుండా మహేష్ ఖలేజా, కళ్యాణ్ రామ్ కత్తిలాగా హీరో పేరుతో టైటిల్ పెట్టడంతో అనుమానాలు వస్తున్నాయి. అంటే ఆల్రెడీ ఎవరన్నా లవ్ లీ టైటిల్ తో రిజిస్టర్ చేసి ఉండి ఉంటారని, టైటిల్ తలనొప్పిలు రాకుండా ముందు జాగ్రత్తగా ముందే ఈ రకంగా హీరో పేరుతో కలిసి టైటిల్ ని రిజిస్టర్ చేయించారని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని జయంత్‌ సి.పర్జానీ దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్స్‌ పతాకంపై గణేష్ బాబు నిర్మిస్తున్నారు. 'లవ్‌ ఆజ్‌ కల్‌' రీమేక్ గా ఈ చిత్రం రూపొందుతోంది. త్రిష, కృతి కర్బందా హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రం ఇటీవల కాశీలో షూటింగ్ జరుపుకుని వచ్చింది. ఈనెల 15 నుంచి న్యూజిలాండ్‌ లో కొన్ని పాటలూ, కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: బడే రవికిరణ్‌, ఛాయాగ్రహణం: జైనన్‌ విన్సెంట్‌, సంగీతం: మణిశర్మ.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu