»   » హాట్ హాట్ నటితో బాలయ్య డిన్నర్ డేట్.. సోషల్ మీడియాలో వైరల్

హాట్ హాట్ నటితో బాలయ్య డిన్నర్ డేట్.. సోషల్ మీడియాలో వైరల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్‌లో నందమూరి బాలకృష్ణ ఎక్కువగా బయట పార్టీలకు, ఇతర కార్యక్రమాల్లో కనిపించరు. షూటింగ్‌ లేకుంటే ఇంటి పట్టునే ఉంటారు.. లేదంటే ఫ్యామిలీతో వెకేషన్ వెళ్తుంటారు. ఇంకా తన నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజల సాధక భాదలు తెలుసుకొంటారు. అలాంటి బాలకృష్ణ తెలుగు తెరకు సరికొత్త హీరోయిన్‌తో డిన్నర్ డేట్‌కు వెళ్లడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఆ యువనటితో కలిసి డిన్నర్ చేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో సంచలనం రేపుతుంది. ఆ యువనటి ఎవరని ఆలోచిస్తున్నారా?

హాట్ టాపిక్‌గా కైరా దత్

హాట్ టాపిక్‌గా కైరా దత్

ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న చిత్రం పైసా వసూల్. ఈ చిత్రంలో ముగ్గురు కథనాయికలు. అందులో ఒకరు కైరాదత్. పైసా వసూల్ విడుదలకు ముందే కైరా దత్ గురించి బాగానే చర్చించుకొంటున్నారు. తాజాగా శమంతకమణి ఆడియో ఫంక్షన్‌కు వచ్చిన ఆమె అందర్ని ఆకర్షించింది.

ట్విటర్‌లో బాలయ్య డిన్నర్ డేట్ ఫొటో

ట్విటర్‌లో బాలయ్య డిన్నర్ డేట్ ఫొటో

తాజాగా మరోసారి కైరాదత్ వార్తలో నిలిచింది. బాలకృష్ణతో ఓ రెస్టారెంట్‌లో డిన్నర్‌కు వెళ్లడం విశేషంగా మారింది. ఆ డిన్నర్‌కు సంబంధించిన ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఆ ఫొటోకు చాలా మంచి రెస్పాన్స్ వస్తున్నది. లైకులు, రీట్వీట్లతో మారుమోగుతున్నది.

బాలయ్య మంచి వ్యక్తి

బాలకృష్ణ గారితో డిన్నర్ నైట్. బాలయ్య పక్క జెంటిల్మన్. సహృదయం ఉన్న మంచి వ్యక్తి. ఆయన అంటే నాకు బాగా ఇష్టం. అమితమైన గౌరవం ఉంది అని ఫొటోతో పాటు కైరాదత్ ట్వీట్ చేసింది. బాలయ్య నాకు షూటింగ్ బాగా సహకరించారని, డైలాగ్ డెలివరీ గురించి వివరించారు. కీలక సన్నివేశాల్లో తన సహకారం మరువలేనిదని ఆమె అన్నారు.

దటీజ్ బాలయ్య బాబు..

దటీజ్ బాలయ్య బాబు..

సాధారణంగా టాలీవుడ్‌లోని హీరోలు తమ వ్యక్తిగత విషయాలను బయటకు వెల్లడించడానికి ఇష్టపడరు. అయితే బాలయ్య మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటారు. ఎవరేమనుకొంటారో అనే విషయాన్ని పట్టించుకోరు. ప్రతీ సందర్భంలోనూ అభిమానులకు చేరువకావాలనుకొంటారు. కైరాదత్‌తో డిన్నర్ డేట్ విషయంలో బాలయ్య ఏంటో మరోసారి రుజువు అయింది.

English summary
Actress Kyra Dutt will soon be making her Tollywood debut with the eagerly-awaited ‘Paisa Vasool. Photos of Balakrishna's recent ‘date night’ with Bollywood actress Kyra Dutt have gone viral. “Date night with Balakrishna Garu. A true gentleman & a man with a golden heart. Unconditional love and eternal respect”, Kyra dutt tweeted with photos.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu