»   » బండి పేరా? సినిమా పేరా??.... ఎల్7 టైటిల్ కి అర్థమేమిటి?

బండి పేరా? సినిమా పేరా??.... ఎల్7 టైటిల్ కి అర్థమేమిటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమా చిన్నదా పెద్దదా కాదు.... స్టార్ల స్టామినా ఎంతఉన్నా థియేటర్ కి రప్పించేందుకే తప్ప సినిమాలో విషయం లేకపోతే థియేటర్ వైపు కన్నెత్తి కూడా చూడరు ప్రేక్షకులు. ఈ మధ్యనే వచ్చి ధారుణం గా చతికిల బడ్డ పెద్ద హీరోల చిత్రాలు ఇదే నిరూపించాయి. అదే సమయం లో చిన్న సినిమా... మరీ బడా స్టార్లంత ఫేం కాని నాని సినిమా మాత్రం సూపర్ హిట్ ని ఖాతాలో వేసుకుంది.... డబ్బింగ్ సినిమా బిచ్చగాడు లక్షలకు దాతని బడ్జెట్ తో వచ్చి కోట్లు కొల్లగొట్టిందీ సినిమా...

కథ లో కంటెంట్ లేకపోతే హీరో మహేష్ అయినా ప్రభాస్ అయినా ఆఖరికి మెగా స్టార్ అయినా ఓటమికి తలవంచాల్సిందే. ఇప్పుడు అదే నమ్మకంతో కేవలం స్క్రిప్ట్ మీద ఉన్న విశ్వాసం తోనే తమ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు రాహూల్ మూవీ మేకర్స్ . సినిమా పేరు "ఎల్7"..

L-7 Movie first look released

'తుంగభద్ర' ఫేమ్ అరుణ్ ఆదిత్ హీరోగా, పూజ ఝవేరి హీరోయిన్ గా మరియు ఇతరులు ప్రధాన పాత్రధారులుగా, రాహూల్ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించబడుతున్న చిత్రం 'ఎల్7'. ఈ చిత్ర నిర్మాత బి. ఓబుల్ సుబ్బారెడ్డి గతంలో 'ఈ వర్షం సాక్షిగా' వంటి పలు చిత్రాలు నిర్మించారు. "లవ్, కామెడీ, థ్రిల్లర్ ప్రధానాంశాలుగా నిర్మించిన ఈ చిత్రం ఔట్ ఫుట్ చాలా బాగా వచ్చిందని నిర్మాత తెలిపారు.

ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని యూనిట్ సభ్యుల సమక్షంలో విడుదల చేసిన చిత్ర యూనిట్, తాజాగా ఆడియోని అతి త్వరలో రిలీజ్ చేస్తున్నాము అన్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా 'ఇష్క్' చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన అరవింద్ శంకర్ పని చేశారు. ఆయన అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ద్వారా ముకుంద్ పాండేని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన గతంలో ఇష్క్, గుండె జారి గల్లంతయ్యింది, మనం వంటి సూపర్ హిట్ చిత్రాలకు కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం విభాగాలలో పని చేశారు అని నిర్మాత తెలిపారు.

English summary
New Tollywood Movie L7 First look released and producer announced that Audio will be very soon
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu