»   » ‘లచ్చిందేవి ఓ లెక్కింది’ అఫీషియల్ ట్రైలర్

‘లచ్చిందేవి ఓ లెక్కింది’ అఫీషియల్ ట్రైలర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి శిష్యుడు జగదీష్ దర్శకత్వంలో నవీన్ చంద్ర, లావణ్య త్రిపాఠి జంటగా 'లచ్చిందేవికి ఓ లెక్కుంది' అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ ఆదివారం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకడు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరై సీడీలను ఆవిష్కరించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ విడుదల చేసారు.

Lacchimdeviki O Lekkundi (LOL) Official Trailer

మయాఖ క్రియేషన్స్ బ్యానర్లో ప్రసాద్ కామినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం విశేషం. దర్శకుడు మాట్లాడుతూ రాజమౌళి, కీరవాణి గారితో ఉండటం వల్ల నేను పర్ ఫెక్టుగా తయారయ్యాను. మనకు తెలియకుండా కొన్ని లక్షల కోట్లు లక్షల కోట్లు పడి ఉన్నాయి. అదేంటనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. అందరికి నచ్చే విధంగా ఉంటుంది అన్నారు.

ఈ చిత్రంలో జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మాజీ, అజయ్, సంపూర్ణేష్ బాబు, మేల్కోటి, భద్రం, భాను తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి పాటలు శివశక్తి దత్తా, అనంత శ్రీరామ్, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, డాన్స్: తార, కృష్ణారెడ్డి, జానీ, సన్నీ, ఫైట్స్: పి.సతీష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఇ. మధుసూదనరావు, నిర్మాత: సాయి ప్రసాద్ కామినేని, రచన, దర్శకత్వం: జగదీష్ తలశిల.

English summary
Watch the first trailer o of Lachhimdeviki O Lekkundi (LOL) ft. Naveen Chandra and Lavanya Tripathi. an M.M. Keeravaani Musical.
Please Wait while comments are loading...