»   » రాజమౌళితో ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ ఆడియో రిలీజ్ (ఫోటోస్)

రాజమౌళితో ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ ఆడియో రిలీజ్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి శిష్యుడు జగదీష్ దర్శకత్వంలో నవీన్ చంద్ర, లావణ్య త్రిపాఠి జంటగా 'లచ్చిందేవికి ఓ లెక్కుంది' అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ ఆదివారం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకడు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరై సీడీలను ఆవిష్కరించారు.

మయాఖ క్రియేషన్స్ బ్యానర్లో ప్రసాద్ కామినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం విశేషం. ఆదివారం జరిగిన ఆడియో రిలీజ్ కార్యక్రమంలో రాజమౌళి, కీరవాణి, శివశక్తి దత్తా, నవీన్ చంద్ర, లావణ్య త్రిపాఠి, జగదీష్ తలశిల, సాయి ప్రసాద్ కామినేని, అనంత్ శ్రీరామ్, నాని, సునీల్, లక్ష్మీ ప్రసన్న, నవదీప్, నాని, అల్లరి నరేష్, సెంథిల్ కుమార్, కాంచి తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ...‘నా డైరెక్షన్ టీమ్ లో చాలా కీలకమైన వ్యక్తి జగదీష్. నా దగ్గర ఈగ సినిమా వరకు పని చేసారు. ప్రతి సీన్ లో చాలా కేర్ తీసుకుంటాడు. అలాంటి కేర్ ఈ సినిమాకు కూడా తీసుకుని ఉంటాడని అనుకుంటున్నాను. నవీన్, లావణ్య త్రిపాఠి మంచి యాక్టర్స్. అన్నయ్య ఈ సినిమాకు సంగీతం అందించడం చాలా ఆనందంగా ఉంది. మా వదిన సీడీల విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాదు. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను' అన్నారు.


హీరో నవీన్ చంద్ర

హీరో నవీన్ చంద్ర

మా అమ్మ తర్వాత సాయి కొర్రపాటి, హనురాఘవపూడికి జీవితాంతం రుణపడి ఉంటాను. దర్శకుడు జగదీష్ గారు ప్రతీది పర్ ఫెక్టుగా ఉండాలని ప్రయత్నిస్తుంటారు. కీరవాణి గారు మా సినిమాకు సంగీతం అందించడం మా అదృష్టంగా భావిస్తున్నాము. సినిమా అందరికీ నచ్చుతుంది అన్నారు.


దర్శకుడు జగదీష్ మాట్లాడుతూ..

దర్శకుడు జగదీష్ మాట్లాడుతూ..

రాజమౌళి, కీరవాణి గారితో ఉండటం వల్ల నేను పర్ ఫెక్టుగా తయారయ్యాను. మనకు తెలియకుండా కొన్ని లక్షల కోట్లు లక్షల కోట్లు పడి ఉన్నాయి. అదేంటనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. అందరికి నచ్చే విధంగా ఉంటుంది అన్నారు.


కీరవాణి మాట్లాడుతూ..

కీరవాణి మాట్లాడుతూ..

ఈ సినిమాలో లచ్చిందేవికి ఓ లెక్కుంది. స్టోరీ ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమాకు పని చేసిన అందరినీ లక్ష్మీదేవి వరించాలని కోరుకుంటున్నాను అన్నారు.


నటీనటులు

నటీనటులు

ఈ చిత్రంలో జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మాజీ, అజయ్, సంపూర్ణేష్ బాబు, మేల్కోటి, భద్రం, భాను తదితరులు నటిస్తున్నారు.


తెర వెనక

తెర వెనక

ఈ చిత్రానికి పాటలు శివశక్తి దత్తా, అనంత శ్రీరామ్, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, డాన్స్: తార, కృష్ణారెడ్డి, జానీ, సన్నీ, ఫైట్స్: పి.సతీష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఇ. మధుసూదనరావు, నిర్మాత: సాయి ప్రసాద్ కామినేని, రచన, దర్శకత్వం: జగదీష్ తలశిల.


English summary
Lacchimdeviki O Lekkundi Movie audio launch held at Shilapa Kala Vedika in Hyderabad on Sunday (11th Oct) evening.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu