»   »  'లడ్డుబాబు' ఆడియో లాంచ్,మేకప్ విధానం(ఫొటోలు)

'లడ్డుబాబు' ఆడియో లాంచ్,మేకప్ విధానం(ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అల్లరి నరేశ్ , రవిబాబు కాంబినేషన్లో 'లడ్డూబాబు' పేరుతో వస్తున్న ఈ చిత్రంలో హీరో భారీకాయుడిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. పూర్ణ, భూమిక హీరోయిన్స్. త్రిపురనేని రాజేంద్రప్రసాద్‌ నిర్మాత. భాస్కరభట్ల పాటలు రాయగా, చక్రి స్వరాలు సమకూర్చారు. సోమవారం హైదరాబాద్‌లో ఈ చిత్రంలోని గీతాలు విడుదలయ్యాయి. ఈ పంక్షన్ కి అల్లరి నరేష్ చిత్రంలోని గెటప్ లో వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.

తొలిసారి లడ్డుబాబు ఫస్ట్ లుక్ లో అల్లరి నరేష్ గెటప్ చూసి... ఆశ్చర్యపోనివారు ఎవరూ ఉండరు. స్లిమ్ బోయ్‌గా ఉండే నరేశ్... ఫ్యాటీ బోయ్‌గా కనపడటం కోసం చాలా కష్టాలే పడ్డారు. ఈ చిత్రం ఆడియో వేడుక సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో లడ్డుబాబుగా కనిపించడం కోసం అల్లరి నరేశ్ నాలుగున్నర గంటల ముందే స్పాట్‌కి వెళ్లాల్సి వచ్చింది. ఆడియో ఫంక్షన్ కోసమే ఇంత కష్టపడితే, ఈ సినిమా షూటింగ్ జరిగినన్నాళ్లూ అల్లరి నరేశ్ ఎంత కష్టపడి ఉంటారో ఒకసారి ఊహించుకోవచ్చు.

ఆహార్యం, అభినయం పరంగా నరేష్ కిది సవాల్ లాంటి పాత్ర. ఈ పాత్రను అద్భుతంగా చేశారు. లడ్డూబాబుగా నరేష్ ఫస్ట్ లుక్ ఇప్పటికే అందర్నీ ఆకట్టుకుంది. దాదాపు పదేళ్ల తర్వాత రవిబాబు, నరేష్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం కావడం, నరేష్ లుక్ వినూత్నంగా ఉండటం ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ప్రేక్షకులను థ్రిల్ కి గురి చేసే మంచి చిత్రం అందించాలనే లక్ష్యంతో త్రిపురనేని రాజేంద్ర ఈ చిత్రాన్ని నిర్మించారు.నరేష్ పాత్రకు సంబంధించిన మేకప్ కోసమే ఆయన భారీగా ఖర్చు పెట్టారు. ఏ విషయంలోనూ రాజీ పడకుండా రాజేంద్ర ఈ చిత్రం నిర్మించారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.

ఆడియో లాంచ్ ఫోటోలు స్లైడ్ షోలో...

ఆవిష్కరణ...

ఆవిష్కరణ...

'లడ్డుబాబు' చిత్రం తొలి సీడీని అల్లు అరవింద్‌ ఆవిష్కరించారు. తమ్మారెడ్డి భరద్వాజ స్వీకరించారు. ఈ పంక్షన్ యావత్తు చాలా ఆనందోత్సాహాలతో జరిగింది.

లవ్వు,కొవ్వు...

లవ్వు,కొవ్వు...

కరెంటు తీగలా సన్నగా... ఓ మాదిరి గాలికే కొట్టుకుపోయే కుర్రాడిలా కనిపిస్తూ తెరపై నవ్వుల డైనమైట్లు పేల్చే అల్లరి కుర్రాడు... బొద్దుగా బోండంలా తయారయ్యాడు. 'లడ్డుబాబు' కోసమే ఇలా కొత్తగెటప్‌లోకి దూరిపోయాడు. లవ్వు, కొవ్వు కలగలిసిన కుర్రాడిలా తెరపై అలరించబోతున్నాడు నరేష్‌.

లడ్డుబాబు బరువెంతో తెలుసా?

లడ్డుబాబు బరువెంతో తెలుసా?

268 కిలోలు. నడుము సైజు... 78. మరి 36-24-36 అంటూ అవే కొలతలకి ఫిక్స్‌ అయిపోయాడు. అలాంటి లడ్డుబాబు పర్శనల్ లైఫ్ ఎలా సాగింది అనేదే ఈ కథ.

లవ్ స్టోరీస్..

లవ్ స్టోరీస్..

అంత బరువుతో... గడిపే అలాంటి లడ్డుబాబుని అమ్మాయిలు ప్రేమించే సాహసం చేస్తారా? ఛాన్సే లేదు. కానీ లడ్డుబాబుకి మాత్రం రెండు ప్రేమకథలున్నాయి. అవేమిటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు అల్లరి నరేష్‌.

మేకప్ గురించి...

మేకప్ గురించి...

దీన్ని ప్రాస్థెటిక్‌ మేకప్‌ అంటారు. హిందీలో 'పా' కోసం అమితాబ్‌ బచ్చన్‌ ఇలాంటి మేకప్‌ వేసుకొన్నారు. కమల్‌హాసన్‌ కొన్ని సినిమాల కోసం ఇలాంటి మేకప్‌ని ఆశ్రయించారు. అయితే కాళ్లకు చేతులకి కూడా ఆ మేకప్‌ వేసుకోవడం మన దేశంలో ఇదే తొలిసారట.

ఐదు గంటలు పట్టేది

ఐదు గంటలు పట్టేది

లడ్డుబాబు కోసం మేకప్‌ వేయడానికి తొలుత 5 గంటలు పట్టేదట. అలవాటయ్యాక నాలుగున్నర గంటల్లో వేసేవారట. లండన్‌కి చెందిన మైక్‌ అనే మేకప్‌ నిపుణుడి ఆధ్వర్యంలో ఈ రూపం తయారైంది. హిందీలో 'ధూమ్‌' చిత్రాల కోసం అతను పనిచేశాడు. మేకప్‌ ఎలా వెయ్యాలన్నదానిపై ఆయన దగ్గర సలహాలు పొందిన ప్రీతిసింగ్‌, క్లోవర్‌, కరణ్‌సింగ్‌, డి.ఎన్‌.దాదా ఇక్కడ నరేష్‌కి రోజూ మేకప్‌ వేశారట.

షూటింగ్ డేస్..

షూటింగ్ డేస్..

ఈ మేకప్‌ వేసుకొని 68 రోజులు నరేష్‌ షూటింగ్‌ చేశారు. ఆ కష్టం మొత్తం చిత్రం విజయంతో మర్చిపోవచ్చు అంటున్నాడు. ఖచ్చితంగా చిత్రం హిట్టవుతుందని అంటున్నారు.

అంత బరువే..

అంత బరువే..

అల్లరి నరేష్‌ వేసుకొన్న మొత్తం మేకప్‌ బరువు 28 కేజీలు. చేతులు 4 కేజీలు, కాళ్లు 8 కేజీలు, మొహంపైన ఒకటిన్నర కేజీ మేకప్‌ ఉంటుంది. దేహానికి వేసుకొన్న సూటు 14 కేజీలు, అదనంగా మరో మూడు నాలుగు కేజీలు మేకప్‌ ఉంటుందట.

ఇక్కడ వాతావరణం ఇబ్బందే..

ఇక్కడ వాతావరణం ఇబ్బందే..

ప్రాస్థెటిక్‌ వేసుకొన్నప్పుడు 16 డిగ్రీలు టెంపరేచర్‌ ఉంటే ఏ సమస్యా ఉండదు. కానీ... హైదరాబాద్‌ వాతావరణం ఈ మేకప్‌కి సహకరించదట. అందుకే ఎప్పుడూ నరేష్‌ దగ్గర అనకొండ ఏసీలు తీసుకొచ్చి పెట్టేవారట. ఆయన తలపైన ఎప్పుడూ 30టన్స్‌ ఏసీ రన్‌ అవుతూనే ఉండేది. శారీరకంగా ఎక్కువ కష్టం లేకపోతే... మేకప్‌ ఎక్కువసేపు ఉంటుంది. అదే... మాట్లాడి, కిందపడి, తినే సన్నివేశాలుంటే తొందరగా పోయేదట.

అల్లరి నరేష్ మాట్లాడుతూ..

అల్లరి నరేష్ మాట్లాడుతూ..

మేకప్‌ వేసుకొన్నాక తినడం అంటూ ఏమీ ఉండదు. కేవలం ద్రవపదార్థం మాత్రమే తీసుకోవాల్సి వచ్చేది. మొదట ఈ మేకప్‌తో నాలుగు గంటలు మాత్రమే పనిచేయొచ్చు అని చెప్పారు. మేం అంత సులభంగా వదిలిపెడతామా? ఎక్కువసేపే చేసేవాళ్లం. ఇదివరకు సాధారణమైన కామెడీ పాత్రలు కాబట్టి ఇలా వచ్చి... అలా నాలుగు జోక్‌లు వేసుకొని వెళ్లిపోయేవాణ్ని. కానీ ఈ సినిమా కోసం ఈ రూపంలో పనిచేయడం చక్కటి అనుభవాన్నిచ్చింది.

అల్లరి నరేష్ కంటిన్యూ చేస్తూ...

అల్లరి నరేష్ కంటిన్యూ చేస్తూ...

మామూలుగా చెమటోడ్చి పనిచేశాం అంటుంటారు కదా? ఈ సినిమాకి నిజంగా నేను బకెట్లకొద్దీ చెమటోడ్చాను. ఎందుకంటే... తలపై తప్ప ఎక్కడా గాలి ఆడదు. ఈ గెటప్‌ని తొలిసారి చూశాక చాలా బాగుందని మెచ్చుకొన్నారు.

భయపడ్డాను..

భయపడ్డాను..

అంతా మెచ్చుకున్నారు కానీ..నేనైతే గుర్తుపడతారో లేదో అని భయపడేవాణ్ని. కానీ అందరూ బాగా గుర్తుపట్టారు అంటూ ఆనందంగా చెప్పారు నరేష్

కించపరచటం లేదు..

కించపరచటం లేదు..

లావున్నవాళ్లను కించపరిచే సినిమా కాదిది. ఈ సినిమా చూశాక బొద్దుగా ఉన్నవాళ్లకి మరింత గౌరవం పెరుగుతుంది. బొద్దుగా ఉన్నవాళ్ల సమస్యల్ని ఇందులో చూపిస్తున్నాం. అలాంటి రూపమున్న లడ్డుబాబు ఎలా నెగ్గుకొచ్చాడన్నదే ఈ సినిమా కథ

భూమిక నటించింది.

భూమిక నటించింది.

ఈ చిత్రంలో నరేష్‌ సరసన భూమిక నటిస్తోంది. త్రిపురనేని రాజేంద్రప్రసాద్‌ నిర్మాత. నరేష్‌ -రవిబాబు కాంబినేషన్‌లో వచ్చిన ‘అల్లరి' ఎంతటి సంచలనమో తెలిసిందే. కామెడీ నేరేషన్‌లో సరికొత్త పంథాని తెలుగు తెరకి పరిచయం చేశారు దర్శకుడు రవిబాబు. అయితే ఆ సినిమా తర్వాత నరేష్‌, రవిబాబు ఎవరిదారిలో వారు కెరీర్‌ పయనం సాగించారు. ఇన్నాళ్టికి వీరిద్దరి కలయికలో మరో సినిమా వస్తుండటం చర్చనీయాంశం అయింది.

ఎవరెవరు

ఎవరెవరు

భూమిక, పూర్ణ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అలీ, జయప్రకాష్ రెడ్డి, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, కృష్ణబాబు, కొండవలస, ఎల్బీ శ్రీరాం, ఏవీయస్, గిరిబాబు, రాళ్లపల్లి, తెలంగాణ శకుంతల తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: చక్రి, కెమెరా: సుధాకర్ రెడ్డి, స్క్రీన్ ప్లే: సత్యానంద్, మాటలు: నివాస్, పాటలు: భాస్కరభట్ల, ఆర్ట్: నారాయణరెడ్డి ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, రచన-దర్శకత్వం: రవిబాబు, నిర్మాత: త్రిపురనేని రాజేంద్ర.

English summary
The audio of Allari Naresh’s upcoming film Laddu Babu launched on March 17 . Ravi Babu has directed the film and it also stars Poorna and Bhumika Chawla in lead roles. Writer Tripuraneni Maharadhi’s son, Rajendra has produced the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu