»   » లేడీస్ ఫాలోయింగ్ మంచి కిక్కిస్తుంది: నాగ్...!

లేడీస్ ఫాలోయింగ్ మంచి కిక్కిస్తుంది: నాగ్...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

అక్కినేని నాగార్జున చూస్తే వయస్సు మీదపడుతున్నా రోజురోజుకీ కుర్ర హీరోలా వుంటూ అందరి హృదయాల్లో మన్మధుడుగా సెటిలయ్యాడు..నాగ్ కి లేడీస్ ఫ్యాన్స్ చాలా ఎక్కువనే చెప్పాలి. సినిమా హీరోగా నాగ్ కి 25ఏళ్లు నిండాయి. తను తీసే ప్రతీ చిత్రానికి సంబంధించిన కథను ప్రారంభానికి ముందుగానే క్షుణ్ణంగా పరిశీలించి ఎంతో పకడ్భందీగా ప్లాన్ చేసుకుంటానంటున్నడు నాగార్జున. అంతే కాకుండా తన లాగే తన కొడుకును కూడా హీరోగా నిలబెట్టాలని తపన పడుతున్నాడు..

నేనింతటి వాడిని కావడానికి ముఖ్యంగా నాన్నగారే కారణం. నాన్నగారి క్షమశిక్షణలో పెరగడం వలన, ఆయన పెంచిన విధానం వలన హీరోగా కొనసాగుతున్నాను. అసలు నా తొలిసినిమా 'విక్రమ్"ని చూసినప్పుడు ఇంత గ్లామర్ హీరో అవుతానని, నాక్యూడా లేడీస్ ఫ్యాన్స్ వుంటారని నేను ఊహించనే లేదు. నాన్నగారికి లేడీస్ ఫ్యాన్స్ చాలా ఎక్కువగా వున్నారు. అలానే ఇప్పుడు నా విషయంలోనూ లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువే. లేడీస్ ఫాలోయింగ్ మంచి కిక్కిస్తుంది అంటున్నారు మన్మథుడు...

English summary
Nagarjuna is now 52 years still remains as a dream boy for many females, even at this age he looks like in thirties. Though he is capable of giving a young look to youth still he is not preferring. Nagarjuna does not prefer to act in big way making himself busy round the clock.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu