»   » నిర్మాత సి.కళ్యాణ్‌పై లేడీ డాక్టర్ ఫిర్యాదు

నిర్మాత సి.కళ్యాణ్‌పై లేడీ డాక్టర్ ఫిర్యాదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు నిర్మాత సి. కళ్యాణ్ పై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కళ్యాణ్ తనను బెదిరింపులకు గురి చేస్తున్నాడని, తమ ఇంటి మీదకొచ్చి దౌర్జన్యానికి పాల్పడ్డట్లు డాక్టర్ కవిత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ గొడవల వెనక ఫ్లాట్ కు సంబంధించిన తగాదా ఉన్నట్లు తెలుస్తోంది.

ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఐపీసీ 506, 509, 354సీ సెక్షన్ల కింద కేసు నమోదు. ఓ ప్లాటుకు సంబంధించి మెట్రోరైలు నష్టపరిహారం విషయంలో వీరి మద్య వాగ్వాదం జరిగి ఘర్షణ దాకా వెళ్లినట్లు సమాచారం.

Lady doctor complaint against Producer C Kalyan

మరో రెండు రోజుల్లో ‘ఉత్తమ విలన్' రిలీజ్ ఉన్న నేపథ్యంలో సి. కళ్యాణ్ మీద కేసు నమోదు కావడం చర్చనీయాంశం అయింది. కమల్‌ హాసన్ హీరోగా నటించిన 'ఉత్తమ విలన్‌' వచ్చే నెల 1న ప్రేక్షకుల ముందుకొస్తోంది. రమేష్‌ అరవింద్‌ దర్శకత్వం వహించారు. పూజాకుమార్‌, ఆండ్రియా, పార్వతీ మేనన్‌ హీరోయిన్లు. ఈ చిత్రాన్ని తెలుగులో సి.కళ్యాణ్ విడుదల చేస్తున్నారు.

కమల్‌హాసన్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న తమిళ సినిమా ‘ఉత్తమవిలన్‌'. ఎన్‌.లింగుస్వామికి చెందిన తిరుపతి బ్రదర్స్‌, కమల్‌హాసన్‌ కు చెందిన రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ఇది. గిబ్రన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై సి.కళ్యాణ్‌ అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు.

English summary
A police complaint has been lodged against C Kalyan for allegedly attacking a lady doctor.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu