»   » అతి చేసి పూర్తిగా ఇరుక్కుంది

అతి చేసి పూర్తిగా ఇరుక్కుంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : ప్రముఖ గాయని, నటి అయిన లేడీ గాగా తన పాటలకంటే వేసుకునే దుస్తులతోనే ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది. ఒక మనిషి ఇలాంటి ఆహార్యంతో కూడా బయట అడుగుపెట్టవచ్చా అని నోరు వెళ్లబెట్టేలా ఉంటుంది ఆమె వస్త్రధారణ. కేవలం దుస్తులే కాకుండా ఆమె మేకప్‌, కేశాలంకరణ, పాదరక్షలు కూడా మిగతా వారికంటే ఎంతో భిన్నంగా ఉంటాయి.

ఈ విలక్షణతే ఆమెను వార్తల్లోని వ్యక్తిగానూ, వివాదాస్పద గాయనిగానూ నిలుపుతుంది. ఎవరి వూహలకు కూడా అందని మరో ఆశ్చర్యకరమైన చర్యతో మళ్లీ ఆమె ప్రపంచ దృష్టిని తన వైపు తిప్పుకుంది. అదేమిటంటే తన పెంపుడు శునకం అయిన ఆసియా(ఫ్రెంచ్‌ బుల్‌డాగ్‌)ను చిత్రవిచిత్రమైన నగలతో అలంకరించి ఆ ఫోటోలను అంతర్జాలంలో పెట్టింది లేడీ గాగా. ప్రపంచ వ్యాప్తంగా జంతువుల సంక్షేమం కోసం పనిచేసే 'పీపుల్‌ ఫర్‌ ది ఎథికల్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ యానిమల్స్‌'(పెటా) సంస్థ లేడీ గాగాపైన మండిపడుతుంది.

Lady Gaga blasted by PETA over dressed-up dog pics

''లేడీ గాగా ఎలాంటి దుస్తులు ధరించినా తమకు ఏ అభ్యతరంలేదు, అది ఆమె వ్యక్తిగతం. తన పెంపుడు శునకం అయిన ఆసియాపైన ఆమెకు అపార ప్రేమ ఉండవచ్చు. కానీ ఆ మూగజీవి ముఖమంతా నగలతో కప్పి దాన్ని అసౌకర్యానికి గురి చేసే హక్కు మాత్రం ఆమెకు లేద''ని అంటున్నారు పెటా ప్రతినిధులు. ఏ శునకమైనా ఏ విధమైన ఆభూషణాలు లేనప్పటికీ ఎంతో అందంగా కనిపిస్తుందని, వాటి అసలైన ఆనందం సౌకర్యంలోనూ, భద్రతలోనే ఉంటుందన్నది వీరి అభిప్రాయం.

English summary
PETA said: "Lady Gaga may choose to decorate herself with elaborate and even uncomfortable outfits, but Asia doesn't get to make that choice. "Although it seems pretty clear that Lady Gaga loves Asia, we think Asia - and all dogs - are adorable without all the added flair."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu