»   » లిటిల్ క్లాసికల్ డాన్సర్స్ కి లగడపాటి శ్రీధర్ సినిమా ఛాన్స్..

లిటిల్ క్లాసికల్ డాన్సర్స్ కి లగడపాటి శ్రీధర్ సినిమా ఛాన్స్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎవరి గోల వారిదే, స్టైల్ వంటి వినోదాత్మక చిత్రాలు రూపొందించిన లగడపాటి శ్రీధర్ త్వరలో మరో చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు. ఓ టీవీ రియాలటి షో చుట్టూ ఈ కథ తిరగనుందని తెలస్తోంది. ఇందుకోసం ఆయన 10-14 సంవత్సరాల మధ్యగల క్లాసికల్ డాన్సర్స్ కోసం కాస్టింగ్ కాల్ ఇచ్చారు. ఇక ఈ చిత్రాన్ని అరుంధతి, ఒక్కడు వంటి చిత్రాలకు ఆర్ట్ దర్శకత్వం వహించి నంది అవార్డులు అందుకున్న అశోక్ కి డైరక్షన్ భాద్యతలు అప్పచెప్పారు. కంప్లీట్ ఫ్యామిలీ మ్యూజికల్ ఎంటర్టైనర్ గా దీనిని తీర్చిదిద్దనున్నట్లు చెప్తున్నారు. ఇక ఈ డాన్సర్స్ తప్పనిసరిగా కూచిపూడి మరియు భరతనాట్యంలో ప్రావీణ్యత కలిగి ఉండాలంటున్నారు. ఆసక్తి గల పిల్లల తల్లితండ్రులు వారి ప్రొఫైల్స్ ను ఫోటోలతో కలిపి, ఓ రెండు నిముషాల డెమో వీడియోను జతచేసి, style2@larscoworld.com కి పంపమంటున్నారు. అలా కాకుండా పర్శనల్ గా కలవదలిస్తే ముందుగా 040-23608439 ఈ నెంబర్ కు ఫోన్ చేయమనని చెప్తున్నారు.ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. బెస్టాఫ్ లక్...

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu