2018 బన్నీదే, గూస్ బంప్స్, అమీర్ ఖాన్ స్థాయిలో బన్నీ కష్టపడ్డాడు!
Recommended Video

అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా వక్కతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. లగడపాటి శిరీషా శ్రీధర్ , బన్నీవాసు, కె.నాగబాబు నిర్మాతలు. ఇటీవల విడుదలైన ఫస్ట్ ఇంపాక్ట్ టీజర్‌కు టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో నిర్మాత శ్రీధర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

గూస్ బంప్స్
‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' టీజర్ చూసిన వారంతా గూస్ బంప్స్ వచ్చాయని చెబుతున్నారు. సినిమా హిట్టవుతుందనే నమ్మకం అందరిలోనూ ఏర్పడింది. ఇంత టెర్రిఫిక్ రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదు, కేవలం 29 గంటల్లోనే కోటి హిట్స్ రావడం ఆనందంగా ఉంది. బన్నీ మీద ఇంత ప్రేమ కురిపించి, టీజర్‌ను హిట్ చేసిన అందరికీ థాంక్స్' అని నిర్మాత లగడపాటి శ్రీధర్ తెలిపారు.

పాన్ ఇండియా స్టార్ అంటూ ప్రశంసలు
బన్నీ పాన్ ఇండియా స్టార్. అందుకే ఆయన కొత్త కథ ఎంచుకున్నారు. ఆయనలో కొత్త బాడీ లాంగ్వేజ్ మీరంతా చూసి ముగ్దులైపోయారు. సినిమా కథ ఎంత బావున్నా.... బన్నీ అంత ఎఫర్టు పెట్టడం వల్లనే ఇంత హైలెట్ అయింది.... అని శ్రీధర్ లగడపాటి తెలిపారు.

అమీర్ ఖాన్ తర్వాత అల్లు అర్జునే
సినిమా పర్ఫెక్ట్‌గా రావడం కోసం బాలీవుడ్‌లో బాగా శ్రమించేది ఆమిర్ ఖాన్.... తెలుగులో ఆ స్థాయిలో తన పాత్ర పర్ఫెక్షన్ కోసం తపించేది అల్లు అర్జునే అనేది నా అభిప్రాయం. దేశభక్తితో పాటు అల్లు అర్జున్ సినిమా నుంచి అభిమానులు ఆశించే అన్ని అంశాలు ఇందులో ఉంటాయి..... అని శ్రీధర్ లగడపాటి తెలిపారు.

బాహుబలి స్థాయి
బాహుబలి స్థాయిలో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచే విధంగా ‘నా పేరు సూర్య' సినిమా ఉండబోతోంది, 2018 సంవత్సరం బన్నీదే కాబోతోంది. ఆ నమ్మకం మాకు ఉంది అని శ్రీధర్ లగడపాటి చెప్పుకొచ్చారు.

షూటింగ్ ఎక్కడి వరకు వచ్చింది?
సినిమా 70 శాతం పూర్తయింది. ఈ నెల వచ్చే నెల్లో కలిపి దాదాపు 40 రోజులు చిత్రీకరిస్తే సినిమా పూర్తవుతుంది. మార్చికి ఫస్ట్ కాపీ వచ్చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను ఏప్రిల్ 27న విడుదల చేయాలని గట్టి నిర్ణయంతో ఉన్నామని శ్రీధర్ లగడపాటి తెలిపారు.

యాక్షన్ ఎపిసోడ్స్
ఫారిన్ ఫైట్ మాస్టర్ కిచాతో పాటు పీటర్ హెయిన్స్, రవివర్మ, రామ్-లక్ష్మణ్ ఈ చిత్రంలో యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చేశారని, తెలుగు సినిమాలో ఇప్పటి వరకు లేని ది బెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ ఈ చిత్రంలో ప్రేక్షకులు చూస్తారని శ్రీధర్ లగడపాటి తెలిపారు.

ఆ యాంగిల్స్ కూడా
ఈ చిత్రంలో పాట్రియాటిక్, రొమాంటిక్, ఫ్యామిలీ, సొసైటీ యాంగిల్స్ ఇలా అన్నీ ఉంటాయని, తెలుగు సినిమా ప్రేక్షకులకు ఈ చిత్రం సరికొత్త అనుభూతిని ఇస్తుందని శ్రీధర్ లగడపాటి చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











