»   » వామ్మో.... మంచు లక్ష్మి విశ్వరూపం చూపిస్తుందిగా!(ఫోటోస్)

వామ్మో.... మంచు లక్ష్మి విశ్వరూపం చూపిస్తుందిగా!(ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇప్పట వరకు మంచు లక్ష్మీ ప్రసన్న నటిగా చేసిన పాత్రలన్నీ ఒక ఎత్తు... త్వరలో లక్ష్మి బాంబ్ మూవీలో ఆమె చేస్తున్న పాత్ర ఒక ఎత్తు అంటున్నారు. ఈ సినిమాలో ఆమె తన నటవిశ్వరూపం చూపించబోతోందట.

మంచు లక్ష్మి టైటిల్‌పాత్రలో గునపాటి సురేష్‌ రెడ్డి సమర్పణలో ఉద్భవ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనిక చంద్రశేఖర్‌, ఉమా లక్ష్మీనరసింహ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'లక్ష్మీబాంబ్. ప్రస్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది.

ఈ సంద‌ర్బంగా....మంచు లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ ''చాలెంజింగ్‌ పాత్ర చేస్తున్నాను. ఎగ్జయిటింగ్‌ సబ్జెక్ట్. ఇప్పటి వరకు చేయని డిఫరెంట్‌ క్యారెక్టర్‌ జడ్జ్ పాత్రలో కనపడతాను సింగిల్ షెడ్యూల్‌లో ఏక‌ధాటిగా సినిమా షూటింగ్‌ను పూర్తి చేశాంముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్‌ను తమ్ముడు మ‌నోజ్ ఆధ్వర్యంలో చేశాం. డైరెక్టర్‌ కార్తికేయ గోపాలకృష్ణగారు సినిమాను బాగా తెరకెక్కించారు. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను దీపావళి ముందుగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం'' అన్నారు.

చిత్ర సమర్పకుడు గునపాటి సురేష్‌ రెడ్డి మాట్లాడుతూ ''పవర్ ఫుల్ సబ్జెక్ట్ తో, మంచి ఎమోషన్స్ తో లక్ష్మీ బా3బ్ సినిమాను రూపొందించాం. అనుకున్న ప్లానింగ్ లో సినిమా పూర్తయ్యింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మంచు లక్ష్మీగారిని చాలా కొత్త రకంగా ప్రజెంట్ చేసే సినిమా. ఫైట్స్, సాంగ్స్ హైలెట్ అవుతాయి. అన్నారు.

మంచి టీం

మంచి టీం

మంచి టీం కుదిరింది. సినిమాను అనుకున్న ప్లానింగ్‌లో పూర్తి చేస్తున్నాం. ఈ సినిమాలో క్లైమాక్స్ ఫైట్‌ను మ‌నోజ్‌గారు నేతృత్వంలో చేయడం ఆనందంగా ఉంది. అందుకు ఆయనకు థాంక్స్ సెప్టెంబర్లో ఆడియో రిలీజ్ చేసి అక్టోబర్ లో దీపావళి సందర్భంగా సినిమాను రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు గునపాటి.

దర్శకుడు కార్తికేయ గోపాలకృష్ణ మాట్లాడుతూ

దర్శకుడు కార్తికేయ గోపాలకృష్ణ మాట్లాడుతూ

`సినిమా చాలా బాగా వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జయప్రదగారి జస్టిస్ రుద్రమదేవి తర్వాత అంతటి పవర్ ఫుల్ రోల్ చేస్తుంది లక్ష్మీగారే. మనోజ్ గారు క్లైమాక్స్ ఫైట్ కంపోజ్ చేయడం ఎసెట్ అవుతుంది. నిర్మాతలు సురేష్ రెడ్డిగారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు. సెప్టెంబర్ లో సినిమాను ఆడియో రిలీజ్ చేసి దీపావళి సందర్భంగా మా లక్ష్మీ బాంబ్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం‘‘ అన్నారు.

నటీనటులు

నటీనటులు

పోసానికృష్ణ మురళి, హేమ, ప్రభాకర్‌, భరత్‌రెడ్డి, జీవా, అమిత్‌, హేమంత్‌, రాకేష్‌, సుబ్బరాయశర్మ, జె.వి.ఆర్‌, రాజాబాబు, శరత్‌, శ్రీహర్ష, విశాల్‌ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

తెర వునక

తెర వునక

ఈ చిత్రానికి సమర్పణ: గునపాటి సురేష్‌ రెడ్డి, డ్యాన్స్‌: కిరణ్‌, ఆర్ట్‌: రఘుకులకర్ణి, ఫైట్స్‌: రాంబాబు, వెంకట్‌, నందు, ఎడిటింగ్‌: నందమూరి హరి, పాటలు: కరుణాకర్‌,కాసర్లశ్యామ్‌, సంగీతం: సునీల్‌కశ్యప్‌, కెమెరా: మల్హర్‌భట్‌ జోషి, కథ, మాటలు: డార్లింగ్ స్వామి,

లక్ష్మీ బాంబ్

లక్ష్మీ బాంబ్

లైన్ ప్రొడ్యూసర్: సుబ్బారావు, ఆర్‌.సురేంద్రరాజు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె.మురళి, నిర్మాతలు: వేళ్ల మౌనిక చంద్రశేఖర్‌, ఉమా లక్ష్మీ నరసింహ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కార్తికేయ గోపాలకృష్ణ.

English summary
Manchu Lakshmi’s latest movie ‘Lakshmi Bomb’ that was launched on 20th May 2016 is progressing well with its shooting schedules which will be done till August 2016 in a single schedule to complete the entire shooting part.The unit is planning to release the movie before deepavali.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu