మనోజ్ ఎంగేజ్మెంటులో...మంచు లక్ష్మి కంటతడి!
హైదరాబాద్: నటి, నిర్మాత మంచు లక్ష్మి తన చిన్న తమ్ముడు మనోజ్ నిశ్చితార్థం సందర్భంగా కాస్త ఎమోషన్ అయింది. తమ్ముడు ఓ ఇంటి వాడు కాబోతున్నాడనే సంతోషంలో ఆమె ఆనంద భాష్పాలు రాల్చారు. తన సోదరుడు మంచు విష్ణుతో కలిసి ఆమె ఈ హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకున్నారు.
గత రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్న గర్ల్ ఫ్రెండు ప్రణతి రెడ్డితో అతని నిశ్చితార్థం ఈ రోజు జరిగింది. హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ ఇందుకు వేదికైంది. డిజైనర్ బ్రైడల్ వేర్ ధరించి మంచు మనోజ్-ప్రణతి రెడ్డి అందంగా మెరిసి పోయారు. ప్రణతి రెడ్డి తన ఫస్ట్ అప్పియరెన్స్ పసుపురంగు పట్టుచీరలో దర్శనమిచ్చింది. కుదనపు బొమ్మలా మెరిసి పోయింది. పలువురు టాప్ ఫిల్మ్ సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరయ్యారు.

మంచు లక్ష్మి, వెరోనికా, విష్ణు మంచు ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఆ మధ్య ఓ ఇంట్వ్యూలో మనోజ్ మాట్లాడుతూ ఆమెను ఫస్ట్ టైం చూసినపుడే నా భార్యగా ఫిక్సయ్యానని చెప్పుకొచ్చాడు. చార్టెడ్ అకౌంటెంట్ అయిన ప్రణతి రెడ్డి మనోజ్ వదిని వెరోనికా రెడ్డి క్లాస్‌మేట్ అనే సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











