twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మంచు లక్ష్మీప్రసన్న పై రూమర్ కాదు నిజమే...

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఏది చేసినా మంచు లక్ష్మి ప్రసన్న చేయాలి. ఓ విధమైన తెగింపు,ధైర్యం, ఓర్పు ఉన్న నిర్మాతగా, నటిగా ఉన్న లక్ష్మి ప్రసన్న మరో అడుగు ముందుకు వేసారు. ఆమె పేరుమీద ఓ ఫెరఫ్యూమ్ ని మార్కెట్ లోకి తీసుకువచ్చారు. ఆమె తన పేరు మీద ఫెరఫ్యూమ్ తెస్తారని వార్తలు వస్తే అంతా అది రూమర్ అనుకున్నారు. అయితే అది రూమర్ కాదు నిజమే అని ఫెరఫ్యూమ్ ని లాంచ్ చేసి నిరూపించింది. ఆమె సొంతంగా 'ఐకనా క్లాస్ట్‌' పేరుతో ఓ సుగంధ పరిమళం ఉత్పత్తిని మార్కెట్‌లోకి తీసుకొచ్చారు.

    ఈ విషయమై మంచు లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ... ''చదువుకోవడానికి అమెరికా వెళ్లినప్పుడు అక్కడ ఓ పెర్‌ఫ్యూమ్‌ కంపెనీలో ఉద్యోగం చేశాను. సుగంధ ద్రవ్యాల గురించి అప్పుడే నాకు చాలా విషయాలు తెలిశాయి. నేను కూడా ఒక మంచి పెర్‌ఫ్యూమ్‌ని మార్కెట్లోకి తీసుకొస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన అక్కడే తట్టింది. ఆ కల ఇప్పుడు నెరవేరింది'' అన్నారు ఆమె .

    అలాగే... ''నాకు తొలిసారిగా పరిచయమైన పరిమళం అంటే.. మల్లె పూలు. అమ్మ తలనిండా మల్లెలు పెట్టుకోవడం నన్ను చిన్నప్పుడు బాగా ఆకర్షించేది. ఆ తరవాత నాకు కూడా పూలు పెట్టుకోవడం అలవాటైంది. చెన్నై వెళితే ఇప్పటికీ మల్లెపూలు కొంటుంటాను. చిన్నప్పుడు నాన్న పెర్‌ఫ్యూమ్‌ బాటిల్స్‌ని దొంగతనంగా వాడుకొనేదాన్ని. ఇప్పడు మేమెక్కడికైనా వెళ్లేటప్పుడు 'మీకేం కావాలి నాన్నా' అని అడిగితే... మంచి పెర్‌ఫ్యూమ్‌ బాటిల్‌ తీసుకురా అని చెబుతుంటారు. ఆర్నెళ్లపాటు ఎంతో పరిశోధన చేసి ఐకనాక్లాస్ట్‌ ఉత్పత్తిని రూపొందించాం. దీని ఖరీదు ఆరు వేల రూపాయలు'' అన్నారు.

    తను నిర్మిస్తున్న 'గుండెల్లో గోదారి' చిత్రం త్వరలోనే సెన్సార్‌కి వెళుతుందన్నారు. ఈ చిత్రం తమిళ భాగం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయని, యు సర్టిఫికెట్‌ వచ్చిందని తెలిపారు. అనగనగా ఒక ధీరుడు చిత్రంలో ఐరేంద్రిగా విలన్ రోల్ లో అదరకొట్టిన మంచు లక్ష్మి తన నటనకు ఎల్లలు లేవన్నట్లుగా వరసగా సినిమాలు ఒప్పుకుంటోంది. ఆమె స్వయంగా నిర్మిస్తున్న చిత్రం గుండెల్లో గోదారి లోనూ ఆమె పాత్ర కీలకంగా ఉండబోతోందని తెలుస్తోంది. ఇక అరవింద్ స్వామి కీ రోల్ లో చేస్తున్న కడలి చిత్రానికి ఎఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నాడు.

    English summary
    
 Lakshmi Manchu launches her own brand perfume, Iconaclast, the first unisex perfume. It is said that the ingredients used to prepare it were brought from abroad. She's going to launch the perfume in the Luxury Exhibition, very soon. And it would be out in the market in 2013, worldwide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X