»   » భయంతో,అభధ్రతా భావంతో ఉన్నాం: కోపంతో,ఆవేదనతో మంచు లక్ష్మి ఓపెన్ లెటర్

భయంతో,అభధ్రతా భావంతో ఉన్నాం: కోపంతో,ఆవేదనతో మంచు లక్ష్మి ఓపెన్ లెటర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: మళయాళ నటి లైంగిక వేధింపుల ఘటనతో భారతీయ సినీ పరిశ్రమ మొత్తం దిగ్భ్రాంతికి గురి అయ్యి తమదైన శైలిలో స్పందిస్తూ, తమ కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిన్న మాజీ హీరోయిన్ స్నేహ ఈ విషయమై సోషల్ మీడియాలో మాట్లాడారు. ఇప్పుడు మంచు లక్ష్మి ఈవిషయమై ఓ ఓపెన్ లెటర్ ని రాసారు.

ఇన్ని రోజులు తాను స్పందించలేకపోవడానికి కారణం.. ఈ విషయం తెలియగానే షాక్ కి గురయ్యానని చెప్తున్నారు. ఈ ఓపెన్ లెటర్ ద్వారా మళయాళి నటి ఉదంతం పై తన అభిప్రాయాలను పంచుకుంది మంచు లక్ష్మి.

'మన దేశంలో దేవతలుగా పూజిస్తాం. లేకపోతే డోర్లు వేసి బంధించి దాచిపెడతాం. అదృష్టవంతులు ఎవరంటే.. అమ్మ.. భార్య అంతే. కానీ లక్ష్మి.. పార్వతి.. దుర్గ.. సరస్వతి లాంటి దేవతలను ప్రార్ధించడం కరెక్టేనా? ఇలాంటివి జరగడం ఇదేమీ కొత్త కాదు. మనకు ఇవన్నీ నార్మల్ అయిపోయాయి. వేధించడం.. కిడ్నాప్.. అవమానం.. రేప్.. లాంటి ఘటనలు సహజం అయిపోయాయి. మీడియా ఆమె పేరును బయటపెట్టి ఈ పరిస్థితిని మరింత వరస్ట్ గా మార్చేసింది' అని అభిప్రాయపడ్డారు మంచు లక్ష్మి.

అయితే.. తన తోటి మలయాళీ సోదరికి ఎదురైన పరిస్థితి మాత్రం 'సహజం కాదు' అనే విషయం అర్ధం చేసుకోవాలని రాసుకొచ్చింది మంచు లక్ష్మి. నలుగురు ఉన్న రోడ్ లోను.. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో కూడా భయపడాల్సిన పరిస్థితి కారణం ఇప్పుడున్న పరిస్థితులే అంటున్న మంచు లక్ష్మి.. ఈ ఉదంతం తెలిశాక తాను కూడా అభద్రతా భావానికి గురయ్యానని చెప్పింది.

ఇక మంచు లక్ష్మి కెరీర్ విషయానికి వస్తే... ఆమె లేటెస్ట్ మూవీ లక్ష్మీ బాంబ్. వినడానికే చాలా ఆసక్తి కలిగిస్తున్నఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ జడ్జి పాత్రలో లక్ష్మి కనిపించనుందట. దీపావళిలో లక్ష్మీ బాంబ్ ఎంత శక్తివంతమైందో, సినిమాలో తన పాత్ర కూడా అంతే శక్తివంతమైంది అంటూ చెప్పుకొస్తోంది మంచువారమ్మాయి. కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అంటోంది. లక్ష్మీబాంబ్ ఫ్రం శివకాశి..టైటిల్ ఎరైటీగా ఉందంటోంది ఇండస్ట్రీ.

English summary
Lakshmi Manchu writes an open letter to her fans on Facebook where she talks about how the recent abduction and rape of prominent Malayalam actress has shocked her. In the open letter, Lakshmi Manchu talks about how people should teach their children to respect women
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu