»   » ఎన్టీఆర్ జీవితాన్ని వక్రీకరించొద్దు: వర్మకు లక్ష్మీ పార్వతి సూచన

ఎన్టీఆర్ జీవితాన్ని వక్రీకరించొద్దు: వర్మకు లక్ష్మీ పార్వతి సూచన

Posted By:
Subscribe to Filmibeat Telugu
Lakshmi’s NTR: Naked and Exposed Biopic, RGV Confirms

'లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరుతో ఎన్టీఆర్ జీవితం మీద రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తున్నట్లు ప్రకటించగానే ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి స్పందించారు. తనను సంప్రదించకుండా వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ఎలా తీస్తారని ప్రశ్నించారు.

ఎన్టీఆర్ జీవితాన్ని వాస్తవంగా చిత్రీకరించే వారి కోసం ఎదురు చూస్తున్నానని లక్ష్మీ పార్వతి వెల్లడించారు. ఎన్టీఆర్ జీవితాన్ని వక్రీకరించవద్దని, సినిమా ద్వారా నిజాలు బయటపెట్టాలని ఆమె అన్నారు.

Lakshmi Parvathi Response On Ram gopal varma NTR's Biopic

నిజాలు నిర్భయంగా తీస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, అంతే కానీ ఎన్టీఆర్ జీవితంలో జరిగిన విషయాలను వక్రీకరించి చూపిస్తే మాత్రం ఊరుకునేది లేదని లక్ష్మీ పార్వతి అన్నారు. సినిమా తీసేముందు వర్మ తనతో చర్చించాలని ఆమె డిమాండ్ చేశారు.

ఎన్టీఆర్ జీవితంలో వివాదాల జోలికి వెళితే.... జరిగిన వాస్తవాలను వక్రీకరించకుండా చూపించాలని, ఒక వేళ వివాదాల జోలికి వెళ్లకుండా ఉంటే..... ఆయన నట జీవితం, రాజకీయాల్లో ఎదిగిన విషయాలు ఎంతో ఆదర్శంగా ఉంటాయని లక్ష్మీ పార్వతి అభిప్రాయ పడ్డారు.

English summary
Lakshmi Parvathi Response On RGV NTR's Biopic. She stated that history will not forget injustice done to the great actor and politician like NTR.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu