»   » దుబాయ్‌లో ఏం జరుగుతోంది, అంబానీ ఎంటర్ అయ్యారు..శ్రీదేవితో ఎన్టీఆర్‌కు అది కుదరలేదు!

దుబాయ్‌లో ఏం జరుగుతోంది, అంబానీ ఎంటర్ అయ్యారు..శ్రీదేవితో ఎన్టీఆర్‌కు అది కుదరలేదు!

Subscribe to Filmibeat Telugu
SR NTR A Great Fan Of Sridevi

శ్రీదేవి మరణ వార్త ఇప్పటికి తమకు కలగానే ఉందని కొందరు ప్రముఖులు వాపోతున్నారు. అతిలోక సుందరి మరణాన్ని ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నారు. చలాకీగా తిరుగుతున్న శ్రీదేవి అనూహ్యంగా మరణించడంతో ఆమె అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా ఆదివారం సాయంత్రమే శ్రీదేవి భౌతిక కాయం ముంబైకి చేరుకోవాలి. కానీ సవా పరీక్షల్లో జాప్యం జరగడంతో సోమవారం శ్రీదేవి భౌతిక కాయాన్ని ప్రత్యేక విమానంలో తీసుకురానున్నారు. శ్రీదేవి కడసారి చూపుకోసం ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రముఖులు శ్రీదేవి జ్ఞాపకాలని నెమరు వేసుకుంటున్నారు. లక్ష్మి పార్వతి.. ఎన్టీఆర్, శ్రీదేవి గురించి ఆసక్తికరమైన కొన్ని విషయాలని వెల్లడించారు.

కడసారి చూపు కోసం వేయికళ్లతో ఎదురుచూపులు

కడసారి చూపు కోసం వేయికళ్లతో ఎదురుచూపులు

శ్రీదేవిని చివరిసారిగా చూడడానికి ముంబైలోని ఆమె నివాసం వద్ద వేలాదిగా ఆమె అభిమానులు గుమిగూడి ఉన్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని చిత్ర పరిశ్రమల్లో శ్రీదేవి వందలాది చిత్రాలలో నటించి కోట్లాది మంది అభిమానులని సంపాదించారు.

అందంలో అతిలోక సుందరి, నటనలో మహా నటి

అందంలో అతిలోక సుందరి, నటనలో మహా నటి

సౌత్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సమయంలో శ్రీదేవికి బాలీవుడ్ నుంచి పిలుపువచ్చింది. సౌత్ నుంచి వచ్చిన హీరోయిన్లు బాలీవుడ్ లో రాణించడం కష్టం అనే అభిప్రాయం అప్పట్లో ఉండేది. కానీ శ్రీదేవి బాలీవుడ్ స్టార్ హీరోయిన్లని సైతం ఓవర్ టేక్ చేసి ఆలిండియా స్టార్ గా అవతరించింది. శ్రీదేవి నటనలో మహానటి సావిత్రి అనే ప్రశంసలు కూడా దక్కాయి.

దుబాయ్‌లో ఏం జరుగుతోంది

దుబాయ్‌లో ఏం జరుగుతోంది

వాస్తవానికి ఆదివారం సాయంత్రమే శ్రీదేవి భౌతిక కాయం ముంబై కి చేరుకోవాలి. కాలం సవా పరీక్షలలో జాప్యం జరగడంతో ఆమె మృతదేహాన్ని నేడు సోమవారం ముంబైకి తీసుకురానున్నారు.

అంత్యక్రియలు ఎప్పుడు

అంత్యక్రియలు ఎప్పుడు

శ్రీదేవి మృత దేహాన్ని తీసుకువచ్చిన వెంటనే నేడే అంత్యక్రియలు చేస్తారని వార్తలు వస్తున్నాయి. కానీ ఈ విషయాన్ని శ్రీదేవి కుటుంబ సభ్యులు ఎవరూ ధృవీకరించడం లేదు.

అంబానీ రంగంలోకి దిగారు

అంబానీ రంగంలోకి దిగారు

శ్రీదేవి మృత దేహాన్ని ముంబై కి తీసుకుని వచ్చేందుకు దిగ్గజ వ్యాపార వేత్త అనిల్ అంబానీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. రిలయన్స్ కు చెందిన 13 సీట్ల జెట్ విమానాన్ని ఆయన దుబాయ్ కు పంపారు. ఆ విమానంలోనే శ్రీదేవి పార్థివ దేహాన్ని ఇండియాకు తరలించనున్నారు.

ఆలస్యం ఎందుకు

ఆలస్యం ఎందుకు

ఆదివారమే రావాల్సిన శ్రీదేవి పార్థివ దేహం కేవలాం సవా పరీక్షల ఆలస్యంతోనే నేటికి వాయిదా పడినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఆసుపత్రి బయటి వ్యక్తులు మరణిస్తే శవపరీక్ష నివేదిక కోసం 24 గంటల సమయం తీసుకుంటున్నారు. శ్రీదేవి విషయంలో కూడా అదే జరిగింది.

లక్ష్మి పార్వతి చెప్పిన సంగతులు

లక్ష్మి పార్వతి చెప్పిన సంగతులు

శ్రీదేవి మృతితో ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి పార్వతి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్, శ్రీదేవి మధ్య పలు ఆసక్తికర విషయాలని ఆమె వెల్లడించారు. ఎన్టీఆర్ శ్రీదేవి వీరాభిమాని అని ఆమె అన్నారు.

కళ్ళముందు కనిపిస్తున్నా

కళ్ళముందు కనిపిస్తున్నా

కొన్ని విషయాలు కళ్ళముందు కనిపిస్తున్నా మనం నమ్మలేం. అలంటి వాటిలో శ్రీదేవి మరణవార్త కూడా ఒకటని లక్ష్మి పార్వతి అన్నారు.

నిండైన మనసు మాట్లాడేది తక్కువ

నిండైన మనసు మాట్లాడేది తక్కువ

శ్రీదేవి చాలా తక్కువగా మాట్లాడతారని లక్ష్మి పార్వతి అన్నారు. ఆమెని చివరగా చెన్నైలో కలుసుకున్నానని ఎన్టీఆర్ మృతిపట్ల ఆమె సంతాపం తెలియజేసారని లక్మి పార్వతి అన్నారు. శ్రీదేవి నిండైన మనసు కల వ్యక్తి అని ఆమె కొనియాడారు.

వైదేహి సినిమా ఎన్టీఆర్ కల

వైదేహి సినిమా ఎన్టీఆర్ కల

శ్రీదేవితో ఎన్టీఆర్ పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఆయన శ్రీదేవికి వీరాభిమని. శ్రీదేవితో వైదేహి అనే చిత్రం చేయాలనే ఆలోచన ఎన్టీఆర్‌లో ఉండేది. మధ్య వయసున్న సీతా రాముల కథ అది. సేత పాత్రలో శ్రీదేవిని నటింపజేయాలని ఎన్టీఆర్ భావించారు. కానీ అనివార్య కారణాల వలన ఆ సినిమా కలగానే మిగిలిపోయిందని లక్ష్మి పార్వతి అన్నారు.

English summary
Lakshmi Parvathi reveals NTR dream project with Sridevi. NTR wants to see Sridevi as Seetha role.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu