»   » 'జూ ఎన్టీఆర్' కు మహానటుడు 'ఎన్టీఆర్' తో పోలిక లేనేలేదు..?

'జూ ఎన్టీఆర్' కు మహానటుడు 'ఎన్టీఆర్' తో పోలిక లేనేలేదు..?

Subscribe to Filmibeat Telugu

ఇటీవలి కాలంలో మీడియాకు దూరంగా వుంటూ వస్తున్న లక్ష్మీ పార్వతి బాలయ్య ఇచ్చిన సెంటిమెంట్ టచ్ తో తిరిగి ఉత్తేజితురాలయింది. ఇటీవల మీడియాతో మాట్లాడిన ఈమె తమ భర్త నందమూరి తారక రామారావుకి, మనవడు జూ ఎన్టీఆర్ కు రూపంలో ఏ మాత్రం పోలికలు లేవని స్పష్టం చేసింది. కానీ నటనలో మాత్రం జూ ఎన్టీఆర్ మహానటుడు ఎన్టీఆర్ కు పోలికలు వున్నాయని తప్పకుండా జూ ఎన్టీఆర్ మహానటుడి స్థాయికి ఎదుగుతాడని తెలిపింది.

ఇదిలా వుంటే తాత పోలికలు పునికిపుచ్చుకున్న మనవడిగా జూ ఎన్టీఆర్ ను ఎంతగానో అభిమానిస్తున్న ఆయన అభిమానులు మాత్రం వయసు మీరిపోతున్న లక్ష్మీ పార్వతికి చూపు మందగించింది కాబోలు అని సెటైర్లు వేస్తున్నారు. మరి మీరెమంటారు ఎన్టీఆర్ కు జూ ఎన్టీఆర్ కు పోలికలు ఉన్నట్టా లేనట్టా..!?

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu