»   » గాయపడిన మోహన్ బాబు కుమార్తె లక్ష్మీ ప్రసన్న...

గాయపడిన మోహన్ బాబు కుమార్తె లక్ష్మీ ప్రసన్న...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ నటుడు డా.మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి ప్రసన్న ఈ రోజు ఓ ప్రమాదంలో గాయపడినట్టు సమాచారం. ప్రమాదవశాత్తు మెట్ల మీద నుండి జారిపడిన ఆమె ముక్కుకు గాయం అయినట్టు సమాచారం. వెంటనే ఆమెను కిమ్స్ కు తరలించగా, ముక్కుకు తీవ్రమైన గాయం అయినట్టు గుర్తించిన వైద్యులు సర్జరీ నిర్వహించారని తెలుస్తుంది.

సర్జరీ తరవాత ఆమెను వైద్యులు ఇంటికి పంపించారని కూడా తెలుస్తుంది. అనగనగా ఓ ధీరుడు సినిమాతో నటి గా తెరంగేట్రం చేసిన లక్ష్మి ప్రసన్న ప్రస్తుతం సొంత బ్యానర్ లో 'గుండెల్లో గోదావరి' అనే సినిమాలో పూర్తిస్థాయి హీరోయిన్ గా నటించటానికి సన్నాహాలు చేసుకుంటుంది. అంతే కాకుండా ఈ టీవీ లో 'ప్రేమతో మీ లక్ష్మి..' అనే టాక్ షో నిర్వహిస్తుంది. మరి ఇప్పుడు ఈ ప్రమాదం తీవ్రత ఆ కార్యక్రమాలఫై ఎంతవరుకు ఉంటుందో వేచి చూడాలి.

English summary
Star producer-actress Lakshmi Prasanna (hero Mohan Babu’s daughter) was injured when she fell from the stairs. She suffered injuries on her nose and was immediately taken to hospital.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu