»   » హీరోను తన అపార్టమెంట్ కు రమ్మని ఆహ్వానించిన లక్ష్మీ ప్రసన్న

హీరోను తన అపార్టమెంట్ కు రమ్మని ఆహ్వానించిన లక్ష్మీ ప్రసన్న

Posted By:
Subscribe to Filmibeat Telugu

రొమాంటిక్ హీరో ముద్ర వేసుకున్న సిద్దార్ధని తాజాగా లక్ష్మీ ప్రసన్న తన అపార్టమెంట్ కు ఆహ్వానించింది. ఈ మ్యాటర్ ఇలా చోటు చేసుకుంది. సిద్దార్ద తన తాజా చిత్రం బావని ఎక్కడ చూడాలని కన్ఫూజ్ అవుతున్నట్లు ట్విట్టర్ లో ట్వీట్ చేసారు. నేను ఎక్కడ బావ ఫస్ట్ షో చూడను...ఆప్షన్స్..హైదరాబాద్, వైజాగ్, విజయవాడ..ఇంకా ఎక్కడ అంటూ ట్వీట్ చేసాడు. దానకి రిప్లైగా లక్ష్మీ ప్రసన్న..వైజాగ్ లో సినిమా చూసి తమ సొంత అపార్టమెంట్ కి వచ్చి స్టే అవమని రిప్లై ఇచ్చింది. ఇక సిద్దార్ద బావ చిత్రం ఆడియో రీసెంట్ గా రిలీజైంది.

ఇక సిద్ధార్థ, ప్రణీత జంటగా నటించిన చిత్రం 'బావ'. రాంబాబు దర్శకత్వం వహించారు. శ్రీ కీర్తి కంబైన్స్ పతాకంపై పద్మకుమార్ చౌదరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. హీరో తండ్రిగా రాజేంద్రప్రసాద్ నటించడం సినిమాకు ప్లస్ అయిందని, సిద్ధార్థ, రాజేంద్రప్రసాద్ పోటాపోటీగా నటించారని చెప్తున్నారు. అంతా పల్లెటూరి వాతావరణంలోనే సాగే ఈ సినిమా. పాటలను కూడా ఉభయగోదావరుల్లోనే చిత్రించారు. కెమెరామెన్ అరవింద్ ‌కృష్ణ ప్రతి ఫ్రేమునూ పెయింటింగ్‌ లా చిత్రించారని నిర్మాత చెప్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu