»   » రామ్ చరణ్ తేజ్ గుర్రం ఎక్కిన లక్ష్మీ ప్రసన్న....!

రామ్ చరణ్ తేజ్ గుర్రం ఎక్కిన లక్ష్మీ ప్రసన్న....!

Posted By:
Subscribe to Filmibeat Telugu

'మగధీర" లో నటించిన గుర్రం 'బాషా" ఇప్పుడో సెలబ్రిటీ. గుర్రపు స్వారీ వచ్చిన సినీ కుటుంబాల్లోని వారంతా ఒక్కసారయినా బాషాని ఎక్కి స్వారీ చేయాలని సరదా పడుతున్నారు. అలానే మోహన్ బాబు కూతురు కూడా బాషాపై ఎక్కి స్వారీ చేసింది. ఆ గుర్రంపై స్వారీ చాలా బాగుందనీ, ఆ గుర్రం చాలా వేగంగా పరిగెడతుందని, లక్ష్మీప్రసన్న మెచ్చుకుంది. ఈ గుర్రమెంతో స్పీడని చెబుతోందంటే లక్ష్మీ ప్రసన్నకి గుర్రాలతో పరిచయం ఎక్కువేననుకోవాలి.

ఇదిలావుంటే లక్ష్మీప్రసన్న విలన్ గా నటించిన 'అనగనగా ఒక ధీరుడు" చిత్రం షూటింగ్ పూర్తయింది. సిద్దార్థ హీరోగా ప్రకాశరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శృతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలోని పాత్ర కోసం చాలా కష్టపడ్డానని, ఎన్నో గంటలు కష్టపడి మేకప్ వేసుకున్నానని, చాలా దెబ్బలు కూడా తగిలించుకున్నానని మంచు లక్ష్మీ చెప్పు కొచ్చింది. ఈ సినిమా తర్వాత తనకు నటిగా అవకాశాలు పెరుగుతాయని ఆమె అంటోంది. ఝుమ్మంది నాదం సినిమా తర్వాత మరో చిత్రాన్ని నిర్మించకుండా లక్ష్మీ మళ్లీ టాక్ షోలు చేసుకుంటోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu