For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హీరోతో పాటలే కాదు ఫైట్స్ కు సై...సెక్సీ లక్ష్మీరాయ్‌(ఫోటో ఫీచర్)

  By Srikanya
  |

  హైదరాబాద్ : కెరీర్ లో హిట్టు అనేది కనపడకపోయినా వరస ఆఫర్స్ తో బిజీగా ఉండే హీరోయిన్స్ లో లక్ష్మీ రాయ్ ఒకరు. ఆమె సినిమాలకు తెలుగు,తమిళంలో సమానమైన మార్కెట్ ఉంది. ఒక్క హిట్ పడితే నేనేంటో నిరూపిస్తానంటూ చెలరేగిపోయే ఈ ముద్దుగుమ్మ అందాల ప్రదర్శనలోనూ తోటి హీరోయిన్స్ కి సవాల్ విసురుతూంటుంది. తాజాగా ఆమె 'ఒన్బదుల గురు'అనే తమిళ చిత్రంలో ఫైట్స్ కూడా చేస్తోంది. అయితే ఆమె ఫైట్స్ చేసినా అందాల ప్రదర్శన అందులో ఇమిడే ఉంటుందని కోలీవుడ్ అంటోంది. ఇప్పటికే ఈ చిత్రానికి మంచి క్రేజ్ వచ్చింది. తెలుగులోనూ ఈ చిత్రం డబ్బింగ్ అవనుంది.'కాంచన' సహా తమిళంలో నటించినవి కొన్ని సినిమాలే అయినా అందాల ఆరబోతతో తనదైన ముద్ర వేసింది. ఈ నేపధ్యంలో ఆమె కెరీర్ లో ఆమె వెండితెరపై పలు సందర్బాలలో పరిచిన అందాలను గుర్తు చేసుకుంటే..

  హీరోయిన్ కి అర్దం మారిపోయింది. కేవలం తమని గ్లామర్ డాల్స్ గానే చూడవద్దని వారు కోరుకుంటున్నారు. సినిమాలో తమ పాత్రకూ సరైన ప్రాధాన్యత ఇవ్వమని కోరుతున్నారు. అయితే కమర్షియల్ చిత్రాల్లో అది జరగని పని. కానీ ఇలా లక్ష్మిరాయ్ వంటి వారి ఉత్సాహంతో దర్శకుల ప్రోత్సాహంతో ప్రేక్షకుడికి మరింత మెరుగైన వినోదం మాత్రం అందించే అవకాసం ఉంది. ఈ చిత్రం హిట్టైతే లక్ష్మి రాయ్ రూటులో మరింతమంది ప్రయాణిస్తారనటంతో సందేహం లేదు.

  'కాంచనమాల కేబుల్ టీవి' చిత్రంతో శ్రీకాంత్ సరసన నటించి తెలుగులో పరిచయమైన లక్ష్మీరాయ్ ఆ సినిమా పరాజయం తో ఇక్కడ నిలదొక్కుకోలేకపోయింది. కానీ పరిశ్రమ దృష్టిలో పడటానికి ఇదో వెహికల్ గా ఉపయోగపడింది.

  ప్రభాస్ హీరోగా వచ్చిన పౌర్ణమి,బాలకృష్ణతో అథినాయకుడు చిత్రాలు చేసిది. కానీ సినిమాలు పెద్ద ప్లాప్ కావటంతో ఆమెను గుర్తు పెట్టుకున్న వారు లేరు.

  పూర్తిగా ఖాళీ పడిపోయిన టైమ్ లో మరో సారి సినీ జీవితాన్ని ప్రసాదించాడు లారెన్స్. ఆయన తన హిట్ కాంచనతో లక్ష్మీరాయ్ మళ్ళీ గుర్తింపు తెచ్చి పెట్టాడు. లారెన్స్ తో ఆమె వరసగా మూడు సినిమాలు చేసింది.

  'ఓ పాట పాడామా, ఓ ఆట ఆడామా...అన్నట్టుండే కథలు నేను ఒప్పుకోను. నేను వేసే రోల్‌ తప్పకుండా కథలో భాగమవ్వాలి. ప్రాధాన్యత కలిగి ఉండాలి. అలా లేకపోతే...లక్ష్మీరాయ్ చేసింది కదా అన్న పేరు ఎలా వస్తుంది. ప్రత్యేకతే లేకపోతే ప్రేక్షకులు హర్షించరు' అని భారీ ఎత్తున స్టేట్ మెంట్ ఇచ్చింది

  'నీ ఫిజిక్ భలే బాగుంది.."అని ప్రపంచ ప్రసిద్ధి పొందిన 'టైటానిక్" దర్శకుడు జేమ్స్ కామరూన్ ప్రసంసించడం ఆమె జీవితంలో మర్చిపోలేని విషయమంటుంది. దుబాయ్‌ లో జరిగిన '2011 అబుదాబి మీడియా సమ్మిట్" కార్యక్రమంలో పాల్గొనటానికి వచ్చిన కామరూన్ ఆమెను చూసి ఇలా స్పందించారు.

  ధోణితో ఆమె రిలేషన్ కు ఫుల్ స్టాఫ్ పడకుండానే..ఫిజకల్ ఫిటనెస్ ట్రైనర్ ప్రశాంత్ తో వ్యవహారం నడిపిస్తోందంటూ వార్తలు వచ్చాయి. ఎప్పుడూ ఎవరో ఒకరితో ఎఫైర్ అంటూ వార్తల్లో ఉండేలా మ్యానేజ్ చేసుకోవటంలో లక్ష్మి రాయ్ తనకు తానే సాటి.

  తను చేసిన చిత్రాల్లో వనయుద్దం అనే కన్నడ చిత్రం గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంది. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో ఆ్మె విజయత వశిష్ట్ అనే జర్నలిస్ట్ పాత్ర చేసింది.

  ప్రస్తుతం వినయ్‌, ప్రేమ్‌జీ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతోన్న 'ఒన్బదుల గురు'లో నటిస్తోంది. ఇప్పటి వరకు గ్లామర్‌క్వీన్‌గా కనిపించిన లక్ష్మీరాయ్‌ ఇందులో ప్రత్యర్థులపై కిక్‌లు విసిరుతుందట. ప్రత్యర్థుల్నే కాదు.. ఏకంగా వినయ్‌తోనూ ఒక సన్నివేశంలో ఢీ అంటే ఢీ అంటూ ఫైట్‌ చేసిందట లక్ష్మీరాయ్‌.

  English summary
  Laxmi Rai fights wll be seen in Onbadhula Guru. It's is an upcoming Indian Tamil Comedy film written and directed by newcomer P. T. Selvakumar. The film has Vinay Rai, Anjali and Lakshmi Rai in the lead roles. The film is about the adventurous trip that five guys take together, and what happens to them during their expedition.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X