»   » ఆయనతో ముచ్చటగా మూడు సార్లు చేసాను..చాలా థ్రిల్ గా ఉంది...

ఆయనతో ముచ్చటగా మూడు సార్లు చేసాను..చాలా థ్రిల్ గా ఉంది...

Posted By:
Subscribe to Filmibeat Telugu

'కాంచన" హారర్ చిత్రం అయినా తొలి భాగం నవ్విస్తుంది. రెండవ భాగం థ్రిల్‌కు గురిచేస్తుంది. ఇందులో లారెన్స్ నటన చూసి ఆశ్చర్యపోయాను. ఇంత మంచి చిత్రంలో నేనూ భాగస్వామిని అయినందుకు అనందంగా వుంది.' అన్నారు కథానాయిక లక్ష్మీరాయ్. రాఘవలాన్స్ దర్శకత్వంలో బెల్లం కొండ సురేష్ నిర్మించిన చిత్రం కాంచన"లో ఆమె కథానాయిక. ఈ చిత్రం ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె చెప్పిన సంగతులు...

లారెన్స్ తో నటించిన మూడవ చిత్రమిది. ఆయనతో 'సూపర్ కౌబాయ్" చేస్తున్నప్పుడే 'కాంచన" గురించి తెలుసు. లారెన్స్ పై ఉన్న నమ్మకంతోనే కథ వినకుండానే ఇదొక సక్సెస్‌ ఫుల్ చిత్రం అవుతుందని భావించి అంగీకరించాను. ముందు అనుష్కని అనుకున్నారు. కానీ ఒక రోజు లారెన్స్ ఫోన్ చేసి ఈ చిత్రంలో నటించాలి అన్నారు. ఆయనతో నటించిన మూడవ చిత్రం విజయం సాధించినందుకు ఆనందంగా వుంది.

అతీత శక్తులు వున్నాయంటే... దేవుడు వున్నట్టే మన చుట్టూ అతీత శక్తులు వున్నాయని నమ్ముతాను. అలాగే మానవత్వం వున్న ప్రతీ మనిషిలోనూ దేవుడు వుంటాడని నా నమ్మకం.
ఎలాంటి పాత్ర వేశామన్నది కాదు... ఎన్ని సినిమాల్లో ఎక్కువ నిడివి గల పాత్రలు పోషించామన్నది ముఖ్యం కాదు. పాత్ర చిన్నదైనా ఎలాంటి చిత్రంలో నటించామన్నదే ముఖ్యం. అందుకే 'కాంచన"లో నటించాను.ఇందులో నా పాత్ర నిడివి చాలా తక్కువే. అయినా నాకు ఈ చిత్రం మంచి పేరు తెచ్చి పెడుతోంది.

చాలా రోజుల తర్వాత మళ్ళీ తెలుగులో.. 'కాంచనమాల కేబుల్‌టీవి" తర్వాత మళ్లీ 'కాంచన" ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాను. ప్రస్తుతం బాలకృష్ణ సరసన ఓ చిత్రంలో నటిస్తున్నాను. తెలుగులో మంచి సినిమాల్లో కనిపించాలనే ఇంత గ్యాప్ తీసుకున్నాను. క్రికెటర్ ధోనీతో .. ధోనీ నాకు మంచి మిత్రుడు. అంత కంటే మా మధ్య ఏమీలేదు. కానీ దాన్నే అంతా అపార్థం చేసుకుని రూమర్స్ పుట్టించారు. ఇప్పుడు ఆయన పెళ్లయిపోయింది. హాయిగా వున్నారు అంటోంది

ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మొత్తం ఆరు సినిమాలు చేస్తున్నాను. 'కాంచన" తమిళ్ వెర్షన్ ఈ నెల 22న విడుదలవుతోంది. తెలుగులో బాలకృష్ణతో పరుచూరి మురళి రూపొందిస్తున్న చిత్రంతో పాటు అజిత్‌తో తమిళంలో 'మంగత"లో నటించాను. ఇక మలయాళంలో మోహన్‌ లాల్‌తో 'కాసనోవా" చిత్రంతో పాటు 'అరబియుమ్ ఒటక్కవుమ్ పి. మాధవన్ నాయురుమ్" చిత్రంలోనూ నటిస్తున్నాను. ఈ సినిమాల తర్వాత బాలీవుడ్ గురించి ఆలోచిస్తాను.

English summary
Lakshmi Rai who briefly appeared in just two films Kanchanamala Cable TV and Super Cowboy has been signed to play heroine opposite Balakrishna in an untitled film which will be.. Her Tamil films Mankatha are ready for release. And Kanchana is released recently and running with hit talk.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu