twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఆంధ్రప్రదేశ్ న్యూ రిలీజ్ పోస్టర్ పడింది!

    |

    Recommended Video

    Lakshmi's NTR Releasing In Andhra Pradesh This Week || Filmibeat Telugu

    రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం మార్చి 29న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే కోర్టులో వివాదం కారణంగా ఈ మూవీ రిలీజ్ ఆంధ్రప్రదేశ్‌లో నిలిచిపోయింది. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఉందని, ఎన్నికల తర్వాతే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని కొందరు న్యాయస్థానాన్నిఆశ్రయించడంతో మూవీ విడుదల కాలేదు.

    అయితే తెలంగాణ, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ మార్కెట్లో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' విడుదలైంది. అన్ని చోట్ల ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఏప్రిల్ 11న ఎన్నికలు ముగియనుండటంతో సినిమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదలకు రంగం సిద్ధమైంది.

    ఆంధ్రప్రదేశ్ న్యూ రిలీజ్ పోస్టర్ పడింది!

    తాజాగా రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ న్యూ రిలీజ్ పోస్టర్ విడుదల చేశారు. ఈ వారమే విడుదల అంటూ దానిపై రాసి ఉంది కానీ రిలీజ్ డేట్ లేక పోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో సినిమా వీక్ అయినా వస్తుందా? లేదా? అనే అనుమానాలు నెలకొని ఉన్నాయి.

    కోర్టులో వివాదం కొనసాగుతోంది

    కోర్టులో వివాదం కొనసాగుతోంది

    ఈ మూవీ విడుదలకు సంబంధించి ఏపీ హైకోర్టులో వివాదం కొనసాగుతోంది. హైకోర్టు సినిమా రిలీజ్ మీద స్టే విధించడంపై నిర్మాతలు సుప్రీం కోర్టును ఆశ్రయించినప్పటికీ... అక్కడ కూడా వారికి చేదు అనుభవమే ఎదురైంది. హైకోర్ట్ తీర్పు ఇచ్చే వరకు వెయిట్ చేయాలని సుప్రీం కోర్టు సూచించిన సంగతి తెలిసిందే.

    నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు

    నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు

    అన్ని ఏర్పాటు పూర్తయిన తర్వాత సినిమా ఉన్నట్టుండి రిలీజ్ ఆగిపోవడంతో ఏపీలోని డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయినట్లు తెలుస్తోంది. రామ్ గోపాల్ వర్మ నిర్వహించిన ఓ ఆన్ లైన్ పోల్‌లో ఏపీ ప్రజలు కూడా ఈ సినిమా ఆగిపోవడంపై అసంతృప్తిగా ఉన్నట్లు స్పష్టమైంది.

    ‘లక్ష్మీస్ ఎన్టీఆర్

    ‘లక్ష్మీస్ ఎన్టీఆర్

    ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో థియేటర్ ఆర్టిస్ట్ విజయ్ కుమార్, లక్ష్మీ పార్వతి పాత్రలో కన్నడ నటి యజ్ఞశెట్టి, చంద్రబాబు నాయుడు పాత్రలో శ్రీతేజ్ నటించారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు, వెన్నుపోటు పర్వం ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఈ చిత్రం తెరకెక్కించారు. రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వం వహించగా రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరి నిర్మించారు.

    English summary
    Lakshmi's NTR releasing in Andhrapradesh this week. Director Ram Gopala Varma conducted twitter POLL on Lakshmi's NTR delay in Andhra Pradesh to know the feeling of People. 75 per cent of the viewers say they are angry and sad on delay.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X