For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎన్నికల్లో ఓడిపోవాలని శపించిన వర్మ: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రభావం ఉంటుందట!

|

'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్ప తెలంగాణ, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ అన్ని ఏరియాల్లో విడుదలైంది. ఏపీలో హైకోర్ట్ స్టే విధించడంతో విడదల ఆగిపోయింది. అయితే దీనిపై రామ్ గోపాల్ వర్మ అండ్ టీమ్ సుప్రీం కోర్టును ఆశ్రయించబోతున్నారు.

కాగా... ఏపీలో సినిమా ఆగిపోగానే రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. తెలుగు వాడి ఆత్మగౌరవం కోసం పార్టీ పెట్టిన అతి గొప్ప తెలుగువాడి మరణానికి దారి తీసిన మానసిక క్షోభ తెలుగు వాళ్ళల్లో కొంత మందే చూస్తుంటే ఇంకా ఎందరో కేవలం ఎదురు చూసే పరిస్థితి కల్పించిన ఆ వెన్నుపోటుదారుడెవరో? అంటూ ట్వీట్ చేశారు.

ఈ ఎన్నికలలో ఓటమి ప్రాప్తించుగాక

‘‘సినిమా కోసం పుట్టి, సినిమా మూలంగా సీఎం అయిన మహానాయకుడు ఎలా సీఎం పదవి పోగొట్టుకున్నాడో అనే సినిమా చూడకుండా ఆపుతున్న తెర వెనక ఉన్న వెన్నుపోటు డైరెక్టర్‌కి నాలాంటి కోట్ల ఎన్టీఆర్ అభిమానులందరం కమండలం‌లో నీళ్లు తీసి శపిస్తున్నాం.. ఈ ఎన్నికలలో ఓటమి ప్రాప్తించుగాక.. తధాస్తు'' అంటూ రామ్ గోపాల్ వర్మ తన అసంతృప్తి వ్యక్తం చేశారు.

24 ఏళ్ల క్రితం జరిగిన కథ

24 ఏళ్ల క్రితం జరిగిన కథ

ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.... ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా అనేది 24 ఏళ్ల క్రితం జరిగిన కథ. అందులో కీలక పాత్రధారులు ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు... వైస్రాయ్ హోటల్‌లో ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు. వెన్నుపోటు ఉదంతంలో ఎవరెవరు కీలకపాత్ర పోషించారనే విషయం అందరికీ తెలుసు. ఇదేమీ రహస్యం కాదని తెలిపారు.

ఇంపాక్ట్ అనేది ఉంటుంది, కానీ...

ఇంపాక్ట్ అనేది ఉంటుంది, కానీ...

నేను తీసిన ఈ సినిమా ఎన్నికలపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందని అడిగే వారికి నేను చెప్పేద ఒకటే. ఓటర్‌కు ఒక నమ్మకం అనేది ఉంటుంది. నాయకుడు ఏం చేశాడు, ఆ పార్టీ ఏం చేసింది, ఇంకో ఎవరో వస్తే ఏం చేయబోతున్నారు ఇలాంటి అంశాల ఆధారంగా అతడు నిర్ణయం తీసుకుంటాడు. దీంతో పాటు ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ ఉంటుంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చూసి ఏదైనా కొత్త విషయం తెలిసో, అతడు అంతకు ముందు నమ్మిన దానికి భిన్నంగా ఉండి ఇదే ఇక్కువ నమ్మేవిధంగా ఉన్నపుడు తప్పకుండా ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది. అది ఎంత మంది మీద ఉంటుంది? ఏ కోణంలో ఉంటుంది అనేది నేను అంచనా వేయలేను. ఓటరు దేన్ని నమ్మాడు? అతడికి ఎంత తెలుసు? ఇవన్నీ కలిసి ప్రతి వ్యక్తికి ఒక డిఫరెంట్ ఇంపాక్ట్ ఉంటుందని.. వర్మ తెలిపారు. .

అందుకే వర్మ ఎన్నికల ముందు ఈ సినిమా తీసుకొస్తున్నారా?

అందుకే వర్మ ఎన్నికల ముందు ఈ సినిమా తీసుకొస్తున్నారా?

సినిమా వల్ల కనీసం ఒక 50 శాతం అయినా ఇంపాక్ట్ ఉంటుందనుకున్నాం... అందుకే వర్మ ఎన్నికల ముందు ఈ సినిమా తీసుకొస్తున్నారా? అనే ప్రశ్నకు స్పందిస్తూ... ‘‘ఎన్నికలు ఇప్పుడు లేవు అనుకోండి, ఇదే సినిమా మూడు నెలలు ముందు వచ్చింది అనుకోండి... మీ ఇంప్రెషన్ అనేది అలాగే ఉంటుంది కదా.'' అని వర్మ చెప్పుకొచ్చారు.

బాలయ్య వల్లే ఈ సినిమా ఆలోచన

బాలయ్య వల్లే ఈ సినిమా ఆలోచన

నాకు ఈ సినిమా తీయాలనే ఆలోచన రావడానికి కారణం బాలకృష్ణగారు. ఆయన ఎన్టీఆర్ బయోపిక్ తీయాలనే ఆలోచనలో గతంలో నన్ను కలిశారు. లక్ష్మీపార్వతి ఎపిసోడ్ లేకుండా నేను తీయను అని చెప్పాను. బయోపిక్ అంటే అన్నీ ఉండాలి. గాంధీగారి సినిమాలో బ్రిటిష్ అనే నెగెటివ్ ఫోర్స్ ఉంది. వాళ్లతో పోరాటం చేసి స్వాతంత్ర్యం ఎలా సాధించారనేది బయోపిక్ మెటీరియల్. ఇవి కాకుండా ఆయన పోరుబందర్‌లో పుట్టారు. స్కూలుకు వెళ్లారు, ఉన్నత చదువుల కోసం సౌతాఫ్రికా వెళ్లారు, ఎలా పెళ్లి చేసుకున్నారు అనే విషయాలు చెప్పి బ్రిటిష్ రాగానే సినిమా ఆపేస్తే ఎలా ఉంటుంది? అందుకే నేను చేయనని చెప్పాను. తర్వాత నాకు లక్ష్మీ పార్వతి ఎపిసోడ్‌తో సినిమా తీయాలనిపించిందని ఆర్జీవీ తెలిపారు.

సినిమాలో ప్రధానంగా చూపించేది అదే

సినిమాలో ప్రధానంగా చూపించేది అదే

ఎన్టీ రామారావుగారి లైఫ్ చాలా స్ట్రైట్ లైన్ లైఫ్. సినిమా స్టార్ అయ్యాడు, తర్వాత పొలిటికల్ లీడర్ అయ్యాడు. లక్ష్మీపార్వతి ఎంటరైన తర్వాతే ఆ లైనుకు బ్రేక్ వచ్చింది. ఆ సమయంలోనే ఎన్టీఆర్ సోల్ అనేది బయటకు వచ్చింది. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీలో ప్రధానంగా చూపించే అంశం అదే అని వర్మ తెలిపారు.

English summary
Ram Gopal Varma said "Lakshmis NTR impact will be on the election". Lakshmi's NTR is an upcoming Indian Telugu biographical drama film based on the life of former film actor and chief minister of undivided Andhra Pradesh, N. T. Rama Rao.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more