»   » లాస్ట్ డే: ‘టెంపర్’ థియేటర్ల నుండి తీసేస్తున్నారు!

లాస్ట్ డే: ‘టెంపర్’ థియేటర్ల నుండి తీసేస్తున్నారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్' మూవీ ఈ రోజు(మార్చి 26)తో దాదాపు అన్ని థియేటర్ల నుండి తీసేస్తున్నారు. మార్చి 27న ‘రేయ్', ‘జిల్' చిత్రాలు విడుదలవుతున్న నేపథ్యంలో టెంపర్ చిత్రం ప్రదర్శితమవుతున్న థియేటర్లలో కొత్త చిత్రాలను రీప్లేస్ చేయనున్నారు. అయితే వేళ్లపై లెక్కించే కొన్ని థియేటర్లలో మాత్రం ‘టెంపర్' 50, 100 డేస్ ప్రదర్శితం అవయ్యే అవకాశం ఉంది.

పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘టెంపర్' చిత్రం ఇప్పటి వరకు రూ. 41 కోట్లకుపైగా వసూలు చేసింది. ఎన్టీఆర్ నటించిన హిట్ చిత్రాల జాబితాలో ‘టెంపర్' చిత్రం కూడా చేరింది. ‘టెంపర్' చిత్రం ఎన్టీఆర్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. ఓవరాల్‌గా చూసుకుంటే వసూళ్లు బాగానే వచ్చాయి. నిర్మాతకు లాభాలు మిగిలాయి. అయితే ఈ చిత్రానికి గాను ఓ ఏరియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ సొంతం చేసుకున్న పూరి జగన్నాథ్ మాత్రం లాస్ అయ్యాడని అంటున్నారు.


Last day for 'Temper'

కాజల్‌ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జి, వెన్నెల కిషోర్‌, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్‌ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, కెమెరా: శ్యామ్‌ కె నాయుడు, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఫైట్స్‌: విజయ్‌, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేశ్‌, స్ర్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

English summary
Junior NTR’s recent release “Temper” will be celebrating its last day at box office today. As tomorrow (March 27) there are two new releases “Rey” and “Jil”, almost all the leading theatres and screens are replacing NTR’s movie with either one.
Please Wait while comments are loading...