»   »  ‘పండగ చేస్కో’ షూటింగ్ లాస్ట్ డే ఫోటో

‘పండగ చేస్కో’ షూటింగ్ లాస్ట్ డే ఫోటో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్ తాజా చిత్రం ‘పండగ చేస్కో' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. షూటింగ్ లాస్ట్ డే సందర్భంగా రామ్ ఓ సెల్ఫీ ఫోటో రిలీజ్ చేసాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం మే 14 న విడుదల చేయటానికి దర్శక,నిర్మాతలు నిర్ణయించారు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ప్రీ రిలిజ్ బిజినెస్ షాకిచ్చే రేంజిలో జరుగుతున్నట్లు సమాచారం. రామ్ ఫ్లాఫుల్లో ఉన్నా...దర్శకుడు గోపిచంద్ మలినేని పై ఉన్న నమ్మకమే బిజినెస్ వర్గాలకు నమ్మకాలు ప్రాజెక్టుపై పెంచేలా చేస్తోంది.

రీసెంట్ గా..ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని 6 కోట్లకు జీ తెలుగు వారు తీసుకున్నట్లు సమాచారం. ఫ్యామలీ ఎంటర్టైనర్ కావటం, కోన వెంకట్ కాంబినేషన్ ,రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ కావటం, బ్రహ్మానందం కామెడీ ఈ స్ధాయి బిజినెస్ కు కారణం అంటున్నారు. అంతా సవ్యంగా జరిగితే నిర్మాతకు టేబుల్ ప్రాఫిట్స్ ఖాయం అంటున్నారు. అదే నిజమైతే రామ్ పై గత చిత్రాల ఫ్లాపు ఎఫెక్టు పడనట్లే.


Last day of shoot Pandaga Chesko

తన గత చిత్రాలైన ఒంగోలు గిత్త, మసాలా లాంటి సినిమాలు అనుకున్న రేంజ్‌లో విజయం సాధించకపోవడంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని పండగచేస్కో ద్వారా మనముందుకు వస్తున్నాడు రామ్. ఈ చిత్రంలో బ్రహ్మానందం పాత్ర కీలకం కానుంది. బ్రహ్మానందం...ఈ సారి వీకెండ్ వెంకట్రావ్ గా కనిపించనున్నారని సమాచారం. ఈ పాత్ర కామెడీతో ఇరగ తీస్తుందని చెప్తున్నారు. గతంలో రామ్, బ్రహ్మానందంల కాంబినేషన్ లో వచ్చిన రెడీ చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందే.


రకుల్‌ ప్రీత్‌సింగ్‌, సోనాల్‌ చౌహాన్‌, సాయికుమార్‌, సంపత్‌, రావు రమేష్‌, బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రఘుబాబు, సుప్రీత్‌, బ్రహ్మాజీ, సుబ్బరాజు, అభిమన్యుసింగ్‌, వెన్నెలకిశోర్‌, ప్రభాస్‌ శ్రీను, ఫిష్‌ వెంకట్‌, తేజస్విని తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ; వెలిగొండ శ్రీనివాస్‌, మాటలు: కోన వెంకట్‌, రచన సహకారం: అనిల్‌ రావిపూడి, కెమెరా: ఆర్థర్‌ విల్సన్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌, సంగీతం: థమన్‌.ఎస్‌.ఎస్‌., పాటలు: భాస్కరభట్ల, శ్రీమణి, డ్యాన్స్‌: రాజు సుందరం.

English summary
Pandaga Chesko movie Last day shooting pic released.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu