Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
లతా మంగేష్కర్‌కి తీవ్ర అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు.. పరిస్థితి ఎలా ఉందంటే..
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆమెను సోమవారం రోజు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని ఆమె చెప్పడంతో.. వెంటనే అప్రమత్తమైన ఆమె కుటుంబ సభ్యులు ముంబయిలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కొన్ని రోజులుగా ఆమెకు శ్వాసకోశ సమస్యలు ఉన్నట్లుగా తెలిసింది. ప్రస్తుతం లతా మంగేష్కర్ వయసు 90 సంవత్సరాలు.

అభిమానుల ఆందోళన.. తాజా సమాచారం
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లతా మంగేష్కర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా బాలీవుడ్ వర్గాల సమాచారం. లత ఆరోగ్యంపై ఆమె అభిమానులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, మెల్లగా ఆమె కోలుకుంటోందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించినట్లుగా తాజా సమాచారం.

సుదీర్ఘ కెరీర్.. ఎన్నో పాటలు
సింగర్‌గా లతా మంగేష్కర్ కెరీర్ కెరీర్ చాలా సుదీర్ఘమైనది. ఇప్పటికే దాదాపు 25వేలకు పైగా సోలో పాటలు పాడి గిన్నీస్ రికార్డు క్రియేట్ చేసింది లతా.భారత ప్రభుత్వం చేత పద్మభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే, భారత రత్న, పద్మ విభూషణ్ అవార్డులతో సత్కరించ బడింది లతా మంగేష్కర్. అందరూ ఆమెను నైటింగేల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటుంటారు.

సినిమా పాటలకు ఫుల్‌స్టాప్.. కారణం
కొన్నేళ్ల క్రితం సినిమా పాటలకు ఫుల్‌స్టాప్ పెట్టి కేవలం భక్తి పాటలను మాత్రమే పాడుతోంది లతా. తనకు వయసు పైబడటం, ప్రస్తుతం వస్తున్న పాటలు ఎక్కువగా బూతు పదాలతో ఉండటం కారణంగా అలాంటి పాటలను తాను పాడనని ఓ సందర్భంలో లతా పేర్కొంది.

బీ టౌన్ జనాన్ని మంత్ర ముగ్దులను చేస్తూనే తెలుగులో..
బాలీవుడ్‌లో 1000కి పైగా చిత్రాల్లో పాటలు పాడి.. తన గాత్రంతో బీ టౌన్ జనాన్ని మంత్ర ముగ్దులకు చేసింది లతా మంగేష్కర్. తెలుగులో కూడా సంతానం సినిమాలో ‘నిద్దుర పోరా తమ్ముడా ' అనే పాట పాడి భేష్ అనిపించుకుంది ఈ సీనియర్ గాయని. అలాంటి లతా మంగేష్కర్ ఆరోగ్యం బాగాలేదనే వార్త దేశ వ్యాప్తంగా ఆమె అభిమానుల్లో ఆందోళన నింపుతోంది. తిరిగి ఆమె ఆరోగ్యం కోలుకోవాలని అంతా ప్రార్థిస్తున్నారు.