twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Lata Mangeshkar : ఆస్తుల విలువ ఎన్ని కొట్లో తెలుసా.. ఇప్పటికీ నెలకు లక్షల్లో ఆదాయం.. వారసులు ఎవరు?

    |

    స్వర కోకిల లతా మంగేష్కర్ ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో మరణించారు. ఆమె వయసు 92 సంవత్సరాలు. కోవిడ్-19 పాజిటివ్ అని తేలిన తర్వాత మంగేష్కర్‌ను ఐసీయూలో చేర్చారు. ఆమె మరణంతో యావత్ భారత్ ఇప్పుడు శోక సంద్రంలో మునిగిపోయింది. అయితే ఆమె ఆస్తులు, పెళ్లి కాకపోవడంతో ఆమె ఆస్తులు ఎవరి పరం కానున్నాయి. అనే వివరాల్లోకి వెళితే

    హేమ నుండి లతా మంగేష్కర్‌గా

    హేమ నుండి లతా మంగేష్కర్‌గా

    లతా మంగేష్కర్ 1992లో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి పండిట్ దీనానాథ్ మంగేష్కర్ ప్రసిద్ధ శాస్త్రీయ గాయకుడు మరియు నాటక నటుడు. లతా మంగేష్కర్ అసలు పేరు హేమా మంగేష్కర్. కానీ ఆమె తండ్రి నాటకంలో ఒక పాత్ర పేరు ప్రభావంతో ఆమె పేరు హేమ నుండి లతా మంగేష్కర్‌గా మార్చారు.

    13 సంవత్సరాల వయస్సులో

    13 సంవత్సరాల వయస్సులో

    13 సంవత్సరాల వయస్సులో, లత తండ్రి మరణించాడు. మొత్తం కుటుంబ బాధ్యత లత భుజాలపై పడింది. దీంతో ఆమె చాలా చిన్న వయస్సులోనే పాడటం ప్రారంభించారు. లతా మంగేష్కర్ చిన్నప్పటి నుంచి సంగీతం వైపు మొగ్గు చూపారు. సంగీతాన్ని వారసత్వంగా పొందిన ఆమె కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగా నటనలోకి రావాల్సి వచ్చింది. పిల్లలు బొమ్మలతో ఆడుకునే వయసులో లతా మంగేష్కర్ తన తండ్రి దగ్గర కూర్చొని సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టారు.

    370 కోట్లు ఆస్తి

    370 కోట్లు ఆస్తి

    మీడియా నివేదికల ప్రకారం, లతా మంగేష్కర్ మొదటి సంపాదన 25 రూపాయలు. అలాగే ఆమె మొత్తం ఆస్తులు దాదాపు రూ. 370 కోట్లు. ఆమె సంపాదనలో ఎక్కువ భాగం పాటల రాయల్టీ నుండి వచ్చింది. ఇది కాకుండా, అతను చాలా పెట్టుబడి పెట్టారు. ఆమె దక్షిణ ముంబైలోని నాగరిక ప్రాంతంలో నివసించింది. లతా మంగేష్కర్ పెద్దర్ రోడ్డులో ఉన్న ప్రభు కుంజ్ భవన్ లో నివసించేవారు.

    భుజాలపై మో

    భుజాలపై మో

    అయితే సెలబ్రిటీల ఆస్తుల వివరాలను వెల్లడించే ఓ ఇంగ్లీష్ వెబ్ సైట్ కథనం ప్రకారం మాత్రం కోట్లాది మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ఆమె ఆస్తులు మాత్రం పెద్దగా కూడబెట్టలేదని, తండ్రి మరణానంతరం కుటుంబ భారం మొత్తం భుజాలపై మోసిన ఆమె తన చెల్లెళ్ళ బాగోగులు చూసుకోవడానికే తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొంది.

    భిన్న వాదనలు

    భిన్న వాదనలు

    ఆ వెబ్సైట్ ప్రకారం లతా మంగేష్కర్‌కు రూ.111 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఆమె పాడిన పాటలకు రాయల్టీ ద్వారా వచ్చే ఆదాయం సుమారు నెలకు రూ.40 లక్షలు. ప్రతి ఏటా రూ.6 కోట్ల ఆదాయం వస్తోందని వెల్లడించింది. లతా మంగేష్కర్ పెళ్లి చేసుకోకపోవడంతో ఆమె ఆస్తులు ఇప్పుడు ఎవరికి అనే చర్చ మొదలయింది.

    Recommended Video

    Lata Mangeshkar జ్ఞాపకార్థం సంతాప దినాలు.. గాన కోకిల లతా మంగేష్కర్‌ | Oneindia Telugu
     క్లారిటీ లేదు

    క్లారిటీ లేదు

    అయితే లతా మంగేష్కర్‌కు ముగ్గురు చెల్లెళ్ళు ఒక సోదరుడు. ఆశా భోంస్లే, మీన ఖడికర్, ఉషా మంగేష్కర్, హృదయనాథ్ మంగేష్కర్. అయితే ఆమె ఆస్తులు ఎవరికీ అనే విషయం మీద ఎలాంటి క్లారిటీ లేదు. తన జీవితం అంతా కుటుంబాన్ని పోషించడం కోసం కష్టపడిన ఆమె ఆస్తులు కూడా వారికే అని భావిస్తున్నారు.

    English summary
    Lata Mangeshkar Net Worth and Songs Royalty details
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X