»   » లతా మంగేష్కర్ చనిపోయిందంటూ రూమర్స్!

లతా మంగేష్కర్ చనిపోయిందంటూ రూమర్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Lata Mangeshkar Rubbishes Death Rumours!
హైదరాబాద్: లెజెండరీ సింగర్, భారత రత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్, హార్టర్ ఎటాక్ గురై చనిపోయారంటూ రూమర్లు వ్యాప్తి చెందాయి. అయితే ఈ వార్తలను ఆమె ఖండించారు. తాను క్షేమంగానే ఉన్నానని లతా మంగేష్కర్ స్వయంగా ట్విట్టర్ ద్వారా అభిమానులకు సందేశం పంపారు.

నిన్న లతాజీకి గుండె పోటు వచ్చినట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఓ వైపు అదే రోజు ఉదయమే బాలీవుడ్ సీనియర్ నటి బేబీ నంద మృతి సంఘటనతో హిందీ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగి పోయిన నేపథ్యంలో అదే సమయంలో లతా మంగేష్కర్ గుండె పోటు వార్త అందరినీ షాక్‌కు గురి చేసింది. దీంతో ఆమె ఆరోగ్యం గురించి అంతా ఎంక్వయిరీ చేయడం ప్రారంభించారు.

లతా మంగేష్కర్ వయసు 84 సంవత్సరాలు. గత సంవత్సరం డిసెంబర్లో కూడా లతాజీపై ఇలాంటి రూమర్లే ప్రచారంలోకి వచ్చాయి. అయితే తరచూ తనపై ఇలాంటి రూమర్లు వస్తున్నా లతాజీ మాత్రం సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఆమెది ఎంతో గొప్ప మనసు అని, ఇలాంటి వార్తలు విన్నపుడు ఆమె నవ్వుతారని లతాజీ సన్నిహితులు అంటున్నారు.

అభిమానుల ఆశీర్వాదం వల్లనే తాను ఇప్పటి ఆరోగ్యంగా ఉన్నానని లతా మంగేష్కర్ అంటున్నారు. కాగా ఇలాంటి వార్తలు లతాజీపై వినిపించడంపై పలువురు సినీ ప్రముఖులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మీడియా వారు ఇలాంటి తప్పుడు వార్తలకు అడ్డు కట్ట వేయాలని కోరుతున్నారు.

English summary
Lata Mangeshkar, the legendary singer who was rumoured to have had heart attack rubbished it by clarifying on social media network Twitter. She said, she was absolutely fine.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu