twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bheemla Nayak ప్రీ రిలీజ్ ఈవెంట్ వద్ద లాఠీఛార్జి.. తొక్కిసలాట?

    |

    అనుకున్నంతా అయ్యింది..పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ నేపథ్యంలో తొక్కిసలాట జరగడంతో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అదుపు చేసేందుకు పోలీసులు స్వల్ప లాఠీఛార్జి చేయడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో పవన్ అభిమానులు గాయపడ్డారు. ఆ వివరాల్లోకి వెళితే

    Recommended Video

    Bheemla Nayak: Pawan Kalyan కోసం ఫ్యాన్స్ హంగామా| Bheemla Nayak Review
    ఒకేసారి హిందీలో కూడా

    ఒకేసారి హిందీలో కూడా


    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రానా దగ్గుబాటి కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'భీమ్లా నాయక్'. ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందించారు. 'భీమ్లా నాయక్' చిత్రానికి సెన్సార్ వారు 'U/A' సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ సినిమా ఈ నెల 25న ఏక కాలంలో తెలుగుతో పాటు హిందీలో విడుదల కానుంది. ఈ సినిమాను హిందీలో B4U మోషన్ పిక్చర్స్ వాళ్లు రిలీజ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, రానాలకు హీరోయిన్స్‌గా నిత్య మీనన్, సంయుక్త మీనన్ లు నటించారు.

    వాయిదా

    వాయిదా

    ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. థమన్ సంగీతం అందించారు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సహా తెలుగు వారంతా ప్రస్తుతం భీమ్లా నాయక్ ఫీవర్‌తో ఊగిపోతున్నారు. ఈ సినిమా శుక్రవారం అంటే ఫిబ్రవరి 25న విడుదల కావాల్సి ఉంది. దీంతో సోమవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి మరణించడంతో వేడుకను బుధవారం (ఫిబ్రవరి 23) కు వాయిదా వేశారు.

     ఆంక్షలు అమలు

    ఆంక్షలు అమలు

    ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ వేడుక కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే గతంలో పుష్ప ప్రీ రిలీజ్ సమయంలో తొక్కిసలాట జరగడంతో ముందే మేల్కొన్న పోలీసులు ఒకరోజు ముందే కీలక ప్రకటన చేశారు. ఈ నెల 21వ తేదీన ఇచ్చిన పాసులతో వచ్చేవారికి ఈవెంట్‌లో అనుమతి లేదని తెలిపారు. ఈ నెల 23వ తేదీన ఇచ్చే పాసులతో వచ్చేవారికే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఈవెంట్ హైదరాబాద్ యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో జరగనున్న నేపథ్యంలో యూసుఫ్‌గూడ మార్గంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి తెచ్చారు.

    ఉద్రిక్తత

    ఉద్రిక్తత

    అయితే పోలీసులు ఎన్ని చెప్పినా పోలీస్ బెటాలియన్ గ్రౌండ్ వద్ద భీమ్లా నాయక్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్‎కు భారీగా అభిమానులు తరలి‌వస్తున్నారు. పాసుల ఊసు లేకుండా పోలీసులను తప్పించుచుకుని బారికేడ్లు తన్నేసి అభిమానులు ఈవెంట్ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

    స్వల్పంగా లాఠీఛార్జ్

    స్వల్పంగా లాఠీఛార్జ్

    ఒక రకంగా అభిమానులను పోలీసులు కంట్రోల్ చేయలేకపోతున్నారు. అభిమానులను తరిమేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎంత చెప్పినా వినకపోవడంతో పోలీసులకు, అభిమానులకు మధ్య తొక్కిసలాట జరిగింది. అనుమతి లేకుండా ఈవెంట్‌కు వచ్చిన అభిమానులను పోలీసులు వేదిక వద్దకు అనుమతించడంలేదు. అయితే అభిమానులు కూడా వెనక్కు తగ్గకుండా ఎదురు తిరుగుతూ ఉండడంతో ఏమీ చేయలేక పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జ్ చేశారు.

    English summary
    Bheemla Nayak pre release event is going on, but in an bitter situation lathicharge on pawan fans.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X