»   » 25 కోట్లతో 'లవకుశ' 2డి చిత్రం

25 కోట్లతో 'లవకుశ' 2డి చిత్రం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆర్ టీవీ అధినేతల్లో ఒకరైన రాయుడు వి.శశాంక్ ప్రతిష్ఠాత్మకంగా 'లవకుశ' చిత్రాన్ని 2డి యానిమేషన్ లో నిర్మించారు. ది వారియర్ ట్విన్స్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రాన్ని ఇరవై ఐదు కోట్ల భారీ వ్యయంతో సీనియర్ దర్శకుడు ధవళ సత్యం రూపొందించారు. తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రం గురించి నిర్మాత రాయుడు వి.శశాంక్‌ మాట్లాడుతూ..."నాలుగున్నర సంవత్సరాల పాటు నాలుగు వందల మంది పడ్డ కష్టానికి రూపమే ఈ 'లవకుశ' అన్నారు.

దర్శకుడు మీడియాతో మాట్లాడుతూ..."స్క్రిప్ట్‌ వర్క్‌కి ఏడాదిన్నర పట్టింది. సినిమా నిర్మాణానికి మూడేళ్లు పట్టింది. యానిమేషన్‌ చిత్రం అనగానే ముందు భయపడ్డాను.కానీ నిర్మాణంలోకి దిగాక అంతులేని ఆనందాన్ని అనుభవించాను. అరుదుగా మాత్రమే లభించే అవకాశమిది. ఇతర దేశాలన్నీ తమ కథలను యానిమేషన్‌ చేసి రంజిపజేస్తుంటే..మన కథలతో...వాళ్లను మనం ఎందుకు రంజిపకూడదు అనే ఆలోచన లోంచి పుట్టిందే ఈ 'లవకుశ'. అందరికీ ఈ చిత్రం తప్పక అలరిస్తుంది' అని దర్శకుడు అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu