»   » మా నాన్న అదే పనిలో ఉన్నాడు.. త్వరలోనే శుభవార్త.. లావణ్య త్రిపాఠి

మా నాన్న అదే పనిలో ఉన్నాడు.. త్వరలోనే శుభవార్త.. లావణ్య త్రిపాఠి

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్‌లో అందాల రాక్షసి‌గా ప్రేక్షకులకు పరిచయమైన లావణ్య త్రిపాఠి అనతికాలంలోనే విభిన్నమైన పాత్రలతో మంచి పేరు సంపాదించుకొన్నది. భలే భలే మొగాడివోయ్, సొగ్గాడే చిన్నినాయనా, శ్రీరస్తు, శుభమస్తు చిత్రాలతో వరుస విజయాలను తన ఖాతాలో వేసుకొన్నది. ప్రస్తుతం మిస్టర్ చిత్రంతో చంద్రముఖి పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తన పాత్ర గురించి, తదుపరి చిత్రాల విషయాలను ఫిల్మీబీట్‌కు వెల్లడించింది. అంతేకాకుండా వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేసుకొన్నది. లావణ్య త్రిపాఠి వెల్లడించిన విషయాలు ఆమె మాటల్లోనే...

మిస్టర్‌తో ఎంజాయ్ చేశా..

మిస్టర్‌తో ఎంజాయ్ చేశా..

మిస్టర్ షూటింగ్ చాలా ఎంజాయ్ చేశాం. స్టార్ డైరెక్టర్‌తో పనిచేయడం సంతృప్తి ఇచ్చింది. యూనిట్, సహనటులు చాలా ఎంకరేజ్ చేశారు. నేను చేసిన పాత్రల్లో నచ్చిన పాత్ర చంద్రముఖి ఒకటి. గతంలో విషాద పాత్రలు, యాంగ్రీ ఉమెన్ పాత్రలు ధరించాను. ఈ చిత్రంలో విభిన్నమైన పాత్ర పోషించడానికి అవకాశం దక్కింది. వరుణ్ తేజ్‌తో నటించడం చాలా సంతోషంగా ఉంది. వరుణ్ మంచి సహనటుడు.

12 ఏళ్లు గృహనిర్భంధంలో ..

12 ఏళ్లు గృహనిర్భంధంలో ..

మిస్టర్ చిత్రంలో 12 ఏళ్లు గృహ నిర్బంధంలో ఉంటాను. బాహ్య ప్రపంచం గురించి తెలియదు. సెల్‌ఫోన్, కంప్యూటర్, టెక్నాలజీ లాంటి అంశాలు ఏమి తెలియదు. అమాయకమైన పాత్ర అది. నటనకు మంచి స్కోప్ ఉన్న రోల్ అది. రాజవంశం నేపథ్యం, గ్రామీణ యువతి మాదిరిగా ఉండే పాత్ర. ఈ రోల్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకొన్నాను. డిజైనర్ రూప కూడా చాలా సహకరించింది.

దుస్తుల్లోనే గ్లామర్?.

దుస్తుల్లోనే గ్లామర్?.

సంప్రదాయ దుస్తుల్లో కనిపించినా గ్లామర్ కనపడుతుంది. చినిగిన జీన్స్, టీషర్టులో ఉన్న గ్లామర్‌కు ఢోకా ఉండదు. సోగ్గాడే చిన్నినాయనా చిత్రంలో వివాహితగా కనిపించాను. కాబట్టి చీర ధరించాల్సి వచ్చింది. చీరలోను గ్లామర్‌గా కనపడ్డాను. మన లుక్‌లోనే గ్లామర్ కనబడుతుంది.

 గ్లామర్, ఎక్స్‌పోజింగ్‌కు తేడా

గ్లామర్, ఎక్స్‌పోజింగ్‌కు తేడా

గ్లామర్, ఎక్సపోజింగ్ రెండు వేర్వేరు అంశాలు. గ్లామర్ అనేది ముఖానికి, కళ్లకు సంబంధించిన అంశం. గతంలో మోడల్‌గా పనిచేశాను. కళ్లతోనే భావాలు పలికించడం గ్లామర్. ఎక్స్‌పోజింగ్ అనేది అంగాంగ ప్రదర్శన అని నా అభిప్రాయం. మిస్టర్ చిత్రంలో సింగిల్ క్యాస్టూమ్స్‌లో కనిపించా. అదే లంగా ఓణి (హాఫ్ శారీ)లో కనిపించాను. ఒకే రకమైన క్యాస్టూమ్ ధరించండం ఇదే మొదటిసారి. రాధా చిత్రంలో, నాగ చైతన్య చిత్రంలో వెస్ట్రన్, ఇండియన్ క్యాస్టూమ్స్ ధరిస్తాను.

 జైలు, పోలీసులంటే భయం లేదు..

జైలు, పోలీసులంటే భయం లేదు..

సినిమాలో క్లైమాక్స్‌లో జైలుకు వెళ్లడం అనే అంశంపై ఎలాంటి ఫీలింగ్ లేదు. ఎందుకంటే నిజ జీవితంలో మా నాన్న లాయర్. కోర్టులు, పోలీసులు ఇలాంటివి చిన్నతనంలోనే చూశాను. జైలు కెళ్లడం లాంటివి అంశాలు నన్ను భయపెట్టవు.

బాలీవుడ్ గురించి ఆలోచించడం లేదు..

బాలీవుడ్ గురించి ఆలోచించడం లేదు..

బాలీవుడ్ గురించి ఆలోచించడం లేదు. బాలీవుడ్ సినిమాల కోసం ప్రయత్నించడం లేదు. ఎవరినీ అడుగ లేదు. ప్రస్తుతం టాలీవుడ్‌లో నాకు లభిస్తున్న పాత్రలపై సంతృప్తి ఉంది. ఒకే భాషపై దృష్టిపెట్టాను. తమిళంలో ఒక సినిమా చేశాను. మేలో రిలీజ్ అవుతుంది. సందీప్ కిషన్ హీరో. క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ చిత్రం. తెలుగులో చేస్తున్న రాధా చిత్రం పక్కా కమర్షియల్ ఫిలిం. చాలా ఫన్ ఉంటుంది.

తొలుత తండ్రితో.. ఇప్పుడు కొడుకుతో..

తొలుత తండ్రితో.. ఇప్పుడు కొడుకుతో..

నాగ చైతన్య చిత్రం రెండో షెడ్యూల్ పూర్తయింది. తొలుత తండ్రి నాగార్జునతో పనిచేశాను. ఇప్పుడు నాగచైతన్యతో నటిస్తున్నాను. నటన పరంగా వారిద్దరి స్లయిల్ వేరు. బిహేవియర్ విషయంలో వారిద్దరూ చాలా నైస్ పర్సన్స్. డౌన్ టూ ఎర్త్ పర్సన్. నాగార్జున సార్‌తో బ్లాక్ బస్టర్ వచ్చింది. నాగచైతన్య చిత్రం కూడా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకొంటున్నాను. మనం సినిమాలో నాగచైతన్యతో ఒక సీన్‌లో నటించాను.

సక్సెస్ ఫెయిల్యూర్‌ను..

సక్సెస్ ఫెయిల్యూర్‌ను..

సక్సెస్, ఫెయిల్యూర్‌ను ఒకే విధంగా తీసుకొంటాను. అవి నాపై ఎలాంటి ప్రభావం చూపించవు. సక్సెస్ వస్తే సంతోషపడుతాను. ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఆ సమయంలో కొంత బాధ ఉంటుంది. ఆ తర్వాత మిగితా సినిమాలపై దృష్టిపెడుతాను.

డబ్బింగ్‌పై దృష్టిపెట్టాను.

డబ్బింగ్‌పై దృష్టిపెట్టాను.

తొలి సినిమాలో తెలుగు డైలాగ్స్ ఎక్కువగా ఉన్నాయి. అప్పుడు కొంత కష్టం అనిపించేంది. ప్రస్తుతం డైలాగ్స్ హిందీ, ఇంగ్లీష్‌లో రాసుకొని డైలాగ్స్ చెప్తాను. ప్రస్తుతం తెలుగు భాషపై అవగాహన ఏర్పడింది. డబ్బింగ్ చెప్పాలని ఉంది. ఎవరు ముందుగా అవకాశం ఇస్తారో చూడాలి.

రకుల్, రాశీతో ఆరోగ్యకరమైన పోటీ

రకుల్, రాశీతో ఆరోగ్యకరమైన పోటీ

రకుల్, రాశీఖన్నా నాకు మంచి స్నేహితులు. వారు మంచి పాత్రలతో సక్సెస్ సాధిస్తున్నారు. ప్రొఫెషనల్‌గా పోటీ ఉంటే బాగుంటుంది. ఆరోగ్యకరమైన పోటీ ఉంటే మంచింది. ప్రతీ హీరోయిన్ తమకు లభిస్తున్న పాత్రలకు న్యాయం చేస్తున్నారు. రాశిఖాన్నా మాదిరిగా పాడలేను. కానీ పాటలకు డ్యాన్స్ చేస్తాను. పాటలు పడే కెపాసిటీ ఉందని అనుకొను. పాటలు పాడాలంటే ధైర్యం కావాలి. ముందు ముందు ట్రై చేస్తాను. ప్రస్తుతం డబ్బింగ్‌పై దృష్టిపెట్టాను. రకుల్ ప్రీత్ సింగ్ మాదిరిగా బిజినెస్ చేయడంపై ప్రస్తుతం ఆలోచన లేదు. రకుల్ చాలా టాలెంటెడ్. ప్రస్తుతం నేను టాలీవుడ్‌లో మంచి పాత్రల్లో నటించడంపైనే దృష్టిపెట్టాను. మంచి పేరు తెచ్చుకోవాలనుకొంటున్నాను.

త్వరలో ఓ ఇంటిదాన్ని అవుతా..

త్వరలో ఓ ఇంటిదాన్ని అవుతా..

హైదరాబాద్‌లో స్థిరపడటానికి ప్రయత్నం చేస్తున్నాను. రకుల్, రాశీ ఖాన్నా ఇప్పటికే సొంత ఇళ్లు ఉంది. నేను ఇళ్లు కొనుక్కొని ఇంటిదాన్ని కావాలనుకొంటున్నాను. నా తండ్రి కూడా హైదరాబాద్‌లలో ఇళ్లు కొనుక్కోవడం కోసం వెతుకుతున్నారు. త్వరలోనే ఓ ఇంటిదాన్ని అవుతాను.

English summary
Lavanya Tripathi is now star actor in tollywood. Bhale Bhale mogadivoy, Soggade Chinninayana, Srirastu Shubhamastu are proved her acting ability. Now she came with Mister cinema with Varun Tej. In this occassion, She speak with her mind with filmibeat.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu