»   »  కొత్త స్కిల్ నేర్చుకుంటోంది..ఎంకరేజ్ చెయ్యండి

కొత్త స్కిల్ నేర్చుకుంటోంది..ఎంకరేజ్ చెయ్యండి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సాధారణంగా హీరోలు, హీరోయిన్స్ కానీ ఆఫర్స్ లేనప్పుడు ఏం చేస్తూంటారు..డిప్రెషన్ లోకి వెళ్లటమో లేక ఒళ్లు పెంచుకుని కెరీర్ ని మరీ భారమో చేసుకుంటూంటారు. అయితే లావణ్య త్రిపాఠి కాస్త భిన్నంగా ఆలోచిస్తోంది. ఖాళీగా ఉండటమెందుకని కథక్ నేర్చుకునే పనిలో పడింది లావణ్య త్రిపాఠి. సమయమూ సద్వినియోగం చేసుకున్నట్లు ఉంటుంది. మరో స్కిల్ నేర్చుకున్నట్లు ఉంటుందేది ఆమె ఆలోచన. ఈ విషయాన్ని మీడియాకు తెలియచేసి, తను ఖాలీగా ఉండటం లేదు, ఇక నుంచి మీరు సినిమాల్లో నన్ను బుక్ చేసుకుని నా కొత్త స్కిల్ ని ప్రదర్శన ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్తోంది.

అందాల రాక్షసి చిత్రంతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తర్వాత చేసిన దూసుకెళ్తా చిత్రం పెద్దగా గుర్తింపు తేలేకపోయింది. ఈ మధ్యనే మనంలో గెస్ట్ గానూ కనిపించింది. అయితే దాని గురించి ఆమె మాట్లాడుకోవటమే కానీ ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. దాంతో తన స్కిల్స్ మెరుగుపరుచుకునేందుకు గానూ కథక్ నేర్చుకుంటున్నానని అంటోంది. తన బాడీ లాంగ్వేజ్ ని ఈ నృత్యంతో మెరుగుపరుచుకుంటానంటోంది.

Lavanya Tripathi takes up Kathak

ఆమె మాట్లాడుతూ... "నాకు ప్రధానంగా భరతనాట్యం, కథక్ అంటే ఇష్టం. కానీ సినిమా పాటల్లో డాన్స్ వేరేగా ఉంటుంది కదా. ఇక నన్ను చాలా మంది నన్ను తెలుగమ్మాయే అనుకుంటున్నారు. నా పేరు లావణ్య త్రిపాఠి అయితే లావణ్య తిరుపతి అని పిలుస్తున్నారు. తెలుగమ్మాయిలు చాలా అందంగా ఉంటారు కాబట్టి అలా అనుకోవడం కూడా ఓ కాంప్లిమెంట్ కిందే తీసుకుంటున్నా'' అని చెప్పారు

తన సినిమాలు గురించి మాట్లాడుతూ....తెలుగులో స్క్రిప్టులు వింటున్నాను. త్వరలో అవి ఓ కొలిక్కి వస్తాయనుకుంటున్నా. తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నా. కొత్త సినిమాల ఎంపికలో నా మొదటి ప్రాధాన్యం కథ, తర్వాత నాకు ఆఫర్ చేసిన రోల్. కమర్షియల్ అంశాల గురించి నేనెక్కువగా ఆలోచించను. ఎప్పుడూ ఒకే రకమైన పాత్రల్ని కాకుండా భిన్నమైన పాత్రలు చేయాలనేది నా కోరిక అని చెప్తోంది.

English summary
Lavanya Tripathi reveals, "I have taken time out for myself and for the past few months, I have been learning Kathak. My sister has a diploma in this dance form and I used to dance until few years ago. Now that I have plenty of time for myself, I felt it was about time to improve my body language and Kathak is one such dance form, which adds more grace to your body." she says.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu