»   » మిస్టర్ కంటే మిస్ బాగానే రెచ్చిపోతోంది

మిస్టర్ కంటే మిస్ బాగానే రెచ్చిపోతోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

అందాల రాక్షసితో వెండి తెర‌పై సంద‌డి చేసింది లావ‌ణ్య త్రిపాఠీ. ఆ త‌ర‌వాతొచ్చిన దూసుకెళ్తాలోనూ క‌నిపించింది. అయితే... లావ‌ణ్యకు గొప్ప అవ‌కాశాలేం రాలేదు. న‌టిగా ఓకే గానీ, గ్లామ‌ర్ విష‌యంలో అత్తెస‌రు మార్కులు తెచ్చుకొంది. అయితే మారుతి సినిమా 'భ‌లె భ‌లె మ‌గాడివోయ్‌'తో ఆమె దశ తిరిగింది. ఈ సినిమా తర్వాత వచ్చిన సోగ్గాడే చిన్ని నాయిన‌'లో మరింత గ్లామ‌ర్‌ గా కనిపించింది.

మరింత వ‌న్నె తెచ్చుకొంటూ.. స్క్రీన్ ప్రెజెన్స్‌తో అంద‌రి మ‌తిపోగొట్టింది. అయితే ఆ క్రేజ్ కూడా ఎక్కూవకాలం నిలబడాలంటే వార్తల్లో ఉనడాలి కదా... వార్తల్లో ఉండాలంటే ఆఫర్లూ ఉందాలి అవే ఇప్పుడు కావల్సింది... మిస్టర్ తర్వాత వచ్చే రాధ తప్ప ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్ రిలీజ్ లు ఏమీ లేవు. అందుకే వచ్చిన్ ఈ సమయం లోనే ఎక్కువ ప్రమోట్ చేసుకోవాలనుకుంది... తనను ప్రమోట్ చేసుకోవాలంటే సినిమా ప్రమోషన్ లలో ఎక్కువ కనిపిస్తూ ఉండటమే....

Lavanya Tripati promoting Mister aggressively

లావణ్య త్రిపాఠి తన సినిమా మిస్టర్ ని అగ్రెసివ్‌గా ప్రమోట్‌ చేస్తోంది. మిస్టర్‌ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా నటించిన లావణ్య ఈ చిత్రానికి పబ్లిసిటీ కుమ్మేస్తోంది. వరుణ్‌ తేజ్‌, శ్రీను వైట్లతో సమానంగా ఎక్కడ చూసినా లావణ్యే కనిపిస్తోంది. సోగ్గాడే చిన్నినాయనా, భలే భలే మగాడివోయ్‌ టైమ్‌లో తన కెరియర్‌కి వచ్చిన జోష్‌ ఆ తర్వాత కాస్త తగ్గింది.

ఆశించిన స్థాయిలో పెద్ద సినిమాల నుంచి ఆఫర్లు రాకపోయేసరికి లావణ్య ఇప్పుడు చేతిలో వున్న సినిమాలతోనే మరింతగా చొచ్చుకుపోవాలని చూస్తోంది. మిస్టర్‌తో పాటు రాధ చిత్రంలోను చేసిన లావణ్య ఈ రెండు చిత్రాల తర్వాత స్టార్‌ హీరోల నుంచి పిలుపు ఆశిస్తోంది. తనని చిన్న సినిమాల హీరోయిన్‌గానే చూస్తోన్న నిర్మాతలు లావణ్య నిస్వార్ధంగా పడుతోన్న కష్టం చూసి అయినా అవకాశం ఇస్తారో లేదో చూడాలి

English summary
Lavanya Tripathi is one of the most successful heroines in Tollywood and she is also in much demand now. Yet, she is promoting 'Mister' aggressively as if her career is depended on this.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu