For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రభాస్ మళ్లీ తన పాత ధోరణికి వచ్చేసి... :లారెన్స్

  By Srikanya
  |

  హైదరాబాద్ : డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్ చిత్రాలతో క్లాస్ ప్రేక్షకులకు చేరువైన ప్రభాస్... మళ్లీ తన పాత ధోరణికి వచ్చేసి చేస్తున్న మాస్ సినిమా 'రెబల్'. 'ఛత్రపతి'ని మించే స్థాయిలో ఈ సినిమా ఉండబోతోందని దర్శకుడు రాఘవ లారెన్స్ అంటున్నారు. ప్రభాస్‌ హీరోగాగా నటించిన చిత్రం 'రెబల్‌'. తమన్నా, దీక్షాసేథ్‌ హీరోయిన్స్ . కృష్ణంరాజు ఓ ముఖ్యభూమిక పోషించారు. లారెన్స్‌ దర్శకత్వం వహిస్తున్నారు. జె.భగవాన్‌, జె.పుల్లారావు నిర్మాతలు. చిత్రీకరణ పూర్తయింది. ఈ నెల 28న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్బంగా మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఇలా స్పందించారు.

  అలాగే...''ప్రభాస్‌ కెరీర్‌లో ఓ ప్రత్యేకమైన చిత్రమిది. యాక్షన్‌, వినోదం, భావోద్వేగాలకు ప్రాధాన్యమున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ అలరిస్తుందనే నమ్మకం ఉంద''న్నారు. ''యువతరాన్నే కాకుండా.. కుటుంబ ప్రేక్షకుల్నీ మెప్పించగలనని నిరూపించుకొన్నారు ప్రభాస్‌. తన కెరీర్‌లో మరొక మంచి చిత్రంగా 'రెబల్‌' నిలిచిపోతుంది. లారెన్స్‌ సమకూర్చిన స్వరాలు మరింతగా అలరిస్తాయి. ఈ నెల 28న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు నిర్మాతలు.

  ఇక ఈ నెల 14న పాటల్ని విడుదల చేస్తారు ఈ చిత్రంలో ప్రభాస్ పాత్ర ఢిఫెరెంట్ గా ఉంటుందని చెప్తున్నారు. దాని గురించి చెపుతూ...అతను నిరంతరం మండే అగ్నిగోళంలాంటివాడు. మిట్టమధ్యాహ్నం సూర్యుడు ఎలా భగభగలాడుతూ కనిపిస్తాడో... అతను అలానే ఉంటాడు. ఆ సెగను ఆపడం ఎవరి తరం కాదు. బుల్లెట్‌ అయితే ఒక గుండెనే చీల్చుతుంది. అతను మిస్సైల్‌..ఒక్కసారిగా శత్రు స్థావరాన్ని మట్టుపెట్టేస్తాడు. ఇదంతా ప్రత్యర్థులకే. ప్రేమిస్తే మాత్రం సాయంకాలపు చిరుగాలిలా ఆహ్లాదాన్ని పంచుతాడు. ఇంతకీ అతగాడి కథేంటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు లారెన్స్‌.

  అలాగే ప్రభాస్ సైతం ఈ చిత్రం పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆయన ఈ చిత్రం గురించి చెపుతూ..షూటింగ్ టైమ్ లోనే నాకు మంచి కిక్ ఇస్తున్న సినిమా ఇది. లారెన్స్ ఎక్స్‌ట్రార్డినరీగా తీస్తున్నాడు. నా ఫ్యాన్స్‌కి నచ్చే అంశాలన్నీ ఇందులో ఉంటాయి.ఇందులో నా లుక్ డిఫరెంట్‌గా ఉంటుంది. టైటిల్‌కి తగ్గట్టుగా స్టైలిష్‌గా, పక్కా మాస్‌గా ఉంటుందీ సినిమా అని ప్రభాస్ చెప్తున్నారు. తమన్నా, దీక్షాసేథ్‌ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: సి.రాంప్రసాద్, మాటలు: 'డార్లింగ్'స్వామి, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, నిర్మాణం: బాలాజీ సినీ మీడియా.

  English summary
  Prabhas's upcoming movie is Rebel. Rebel is fetching some solid rates in Trade. The film is getting sold for prices. This film is being produced by Pulla Rao and Bhagavan on Sri Balaji Cine Media banner. Tamannah and Deeksha Seth are playing female leads and Krishnam Raju is playing a very important role.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X