»   »  రసాభాస,కంట్రోల్ చేయలేక పోయాం : మంచు లక్ష్మీ

రసాభాస,కంట్రోల్ చేయలేక పోయాం : మంచు లక్ష్మీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చెన్నై వరద బాదితులను ఆదుకునేందుకు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు స్వయంగా రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఇందుకు గాను వారు ఆదివారం నాడు (కూకట్‌పల్లి), కేపీహెచ్‌బీకాలనీ లో సుజనా ఫోరం మాల్‌లో ఏర్పాటు చేసిన సినీతారల కార్యక్రమం 'మన మద్రాస్ కోసం' రసాభాసగా మారింది.

ఇలా ఎందుకంటే సీనీ నటీనటులైన కాజల్, రానా, అల్లరి నరేష్, నిఖిల్, మంచు లక్ష్మి, తేజశ్వి తదితరులను తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించేందుకు అభిమానులు పోటీపడటంతో పరిస్థితిలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఈ పరిస్థితి తొక్కిసలాటకు దారితీసింది. దీంతో పలువురు అభిమానులు కిందపడిపోయి దెబ్బలు తగుల్చుకున్నారు.

Laxmi Manchu disturbed with over flow of fans

చివరకు వారి సందేశాన్ని ఇలా అందచేసారు.చెన్నై వరద బాధితుల సహయార్థం ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. అనంతరం వారు అక్కడ నుండి వెండనే వెళ్ళిపోయారు. అక్కడ జరిగిన సంగటనకి సంబందించిన మంచు లక్ష్మీట్వీట్ చూడండి.

ఇప్పటికే కొందరు డబ్బు రూపంలో తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించగా....మరికొందరు ప్రస్తుతం వారికి అవసరం అయిన ఆహారం, మెడికల్ సప్లిస్, తాగునీరు, ఇతర వస్తువులు అందించేందుకు రంగంలోకి దిగారు.

దీనిపై మాట్లాడుతూ...‘వందేళ్ల కాలంలో ఎన్నడూ చూడని భారీ వరదలను చెన్నై ఎదుర్కొంటోంది. వీటి కారణంగా లక్షలాది మంది ప్రజలు ఇబ్బందుల పాలవ్వడం బాధాకరం. మా టీం వారికి కావాల్సిన సరుకులను పంపుతోంది. ప్రతి ఒక్కరూ తమకు చేతనైనవి పంపాలి' అని కోరారు.

అన్నింటికంటే ముఖ్యమైనది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన విషయం..... ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బు విరాళంగా ఇవ్వడం కంటే... వారికి కావాల్సిన ఫుడ్, మెడికల్ సప్లిస్, డ్రింకింగ్ వాటర్ అందించడం ఎంతో అవసరం.

నిల్వ ఉండే ఫుడ్, మెడికల్ సప్లిస్, డ్రింకింగ్ వాటర్ లాంటివి అందించే ప్రయత్నం చేయండి. వీటితో పాటు ఇతర వస్తువులు ఏమైనా పంపాలనుకుంటే రామానాయుడు స్టూడియో, ఫిల్మ్ నగర్, జూబ్లిహిల్స్, హైదరాబాద్ అడ్రస్ కు పంపండి. తప్పకుండా వీటిని నేరుగా ఎఫెక్టెడ్ ఏరియాలో ఉండే బాధితులకు మేము అందజేస్తాం' అని రాజమౌళి సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

దయచేసి ఎవరూ వాడిన దుస్తులు మాత్రం పంపొద్దు. గతానుభవంతో చెబుతున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో వీటిని తీసుకోవడానికి ఇష్టపడరు. మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నం అక్కడి వారికి బాగా ఉపయోగ పడుతుందని బావిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటున్న రానాకు థాంక్స్ అని రాజమౌళి పేర్కొన్నారు.

English summary
Laxmi Manchu tweeted: "Went to Forum..we couldn't control the crowd and our safety was at risk. With very very sad heart had to cancel Manjeera and Inorbit."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu