»   » ఆ సంగతి చెబితే నన్ను జైల్లో పెడతారు: ఎల్ బీ శ్రీరాం

ఆ సంగతి చెబితే నన్ను జైల్లో పెడతారు: ఎల్ బీ శ్రీరాం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎల్బీ శ్రీరామ్ మొదట మాట‌ల ర‌చ‌యిత‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత కమెడియన్ గా స్ధిర పడి తెలుగు ప్రేక్ష‌కుల మ‌దిలో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన స్థానం ఏర్పాటు చేసుకున్నారు. 25 ఏళ్లలో నటుడూ, దర్శకుడిగా కూడా తనని తాను నిరూపించుకున్నారు ఎల్బీ. సొంత ఊరూ,అమ్మొ ఒకటో తారీకు,లాంటి సినిమాల్లో ఎల్ బీ నటనని ఎవరూ మర్చిపోలేరు... ఒక కమేడియన్ గానే తెలిసిన ఆయన నటన లో తన విశ్వరూపాన్ని చూపించారు...

ఈ మధ్యనే ఒక చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితానుభవాలని పంచుకున్న ఆయన... మాట్లాడటమే చేతకానీ, మౌనానికి నిదర్శనంగా ఉండే తాను ఈ స్థాయికి వచ్చానంటే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది అంటూ తన చీన నాటి విశయాలనూ చెప్పారు. కుటుంబం లోని అన్నదమ్ములందరూ నాటకాలే వేసేవాళ్లట.

"కొంచెం చెడిపోయిన వారిని సంస్కరించవచ్చు. పూర్తిగా చెడిపోయిన వారిని వారి మానాన వారిని వదిలేయడమే బెటర్" అని వాళ్ళ నాన్న భావించి నాటకాలేసే తమని అల వదిలేసారని చెబుతూ ఆయన పెళ్ళి గురించి అడగగానే "నాకు చిన్న వయసులోనే పెళ్ళయిపోయింది...,ఇప్పుడా విషయం చెబితే నన్ను జైల్లో పెడతారు అంటూ నవ్వేసారు...

LB Sriram starts a Youtube channel

అదలా ఉంటే ఇప్పుదు ఎల్బీ శ్రీరాం నిర్మాతగా కూడా మారారు, మానవీయ విలువలతో షార్ట్ ఫిల్మ్ తీస్తానని... దానికి తన పుట్టినరోజైన మే30న ముహూర్తం ఫిక్స్ చేశానని చెప్పారు. అందులో భాగంగా తన పేరులో ఉన్న మొదటి రెండు అక్షరాల కలయికతో "లైఫ్ ఈజ్ బ్యూటీపుల్" బ్యానర్ పై యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ రిలీజ్ చేసే ఆలోచలనలో ఉన్నట్టు శ్రీరామ్ చెప్పారు.

ఇప్పటికే ఈ బ్యానర్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు ఎల్.బి శ్రీరామ్. నాలుగున్నర నిమషాల నిడివి ఉన్న ఆ ప్రొమోలో ఎల్బీ తాను తెరకెక్కించబోయే చిత్రాల గురించిన విశేషాల్ని తనదైన శైతిలో వివరించారు. ప్రస్తుతం అది యూట్యూబ్ లో సందడి చేస్తోంది.

English summary
writer and comedian LB Sriram has highlighted about his cine journey and his background
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu