»   » కమలినీ లేని ‘లీడర్’ ఏమౌతుంది???

కమలినీ లేని ‘లీడర్’ ఏమౌతుంది???

Posted By:
Subscribe to Filmibeat Telugu

శేఖర్ కమ్ముల సెంటిమెంట్ గా కలసొచ్చే కమలినీ ముఖర్జిని ఆమధ్య తను చేసిన 'ఆవకాయ బిర్యాని" లో అవకాశం ఇవ్వకపోయే సరికి అది కాస్త ఢాం అనడంతో తాజా గా విడుదలైన చిత్రం లీడర్ లో ఓ ప్రత్యేక పాత్రని పోషిందన్నది గాసిప్పే అని ఆ విషయం సినిమా విడుదలలైన తర్వాత కానీ తెలియలేదు ప్రేక్షకులకు.

శేఖర్ కమ్ముల కథానాయికగా పేరొందిన కమలినీ ముఖర్జీ 'లీడర్" చిత్రంలో లేకపోవడం తీరని లోటుగా కనిపిస్తోంది. లీడర్ షూటింగ్ దశలో ఉండగా కమలినీముఖర్జీ ఎమ్మేల్యేగా నటిస్తోందన్న వార్తలు వినిపించాయి. అవన్నీ గాసిప్పే అని తేలిపోయింది. 'ఆనంద్", గోదావరి" చిత్రాల కథానాయికగా నటించిన కమలినీ 'హ్యాపీడేస్" లో కూడా టీచర్ గా నటించింది. ఈ మూడు చిత్రాలు బాక్సీఫీస్ వద్ద హిట్ అయ్యాయి. కానీ 'లీడర్" లో లేకపోవడమే డివైడ్ టాక్(ఫ్లాప్జ/యావరేజ్) రావడానికి కారణమని కొందరు చమత్కరిస్తున్నారు. కమలినీ లేకపోతే నేం..మరో బెంగాలీ భామ రిచా గంగోపాధ్యాయ కమలినీ స్థానాన్ని భర్తీ చేసింది కదా! అంటున్నారు మరికొందరు. ఏదేమైనా శేఖర్ కమ్ముల నాయికలు బెంగాలీ భామలే కావడం విశేషం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu