»   » 'ఏ మాయ చేసావె' ఎఫెక్టు 'లీడర్' చిత్రంపై పడుతుందా?

'ఏ మాయ చేసావె' ఎఫెక్టు 'లీడర్' చిత్రంపై పడుతుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాణాను హీరోగా పరిచయం చేస్తూ శేఖర్ కమ్ముల రూపొందించిన లీడర్ చిత్రం రెండు వారాల క్రితం రిలీజై డివైడ్ టాక్ తెచ్చుకుంది. అలాగే నాగచైతన్య హీరోగా గౌతం మీనన్ రూపొందించిన ఏ మాయ చేసావే క్లాస్ ఫిలింగా పేరు తెచ్చుకుంది. ఈ రెండు చిత్రాలు మేగ్జిమమ్ మల్టీ ఫ్లెక్స్, ఎ సెంటర్ల ఆడియన్స్ నే టార్గెట్ చేస్తున్నాయి. దాంతో రెండు చిత్రాలను ఆదరించే ప్రేక్షకులు ఒకరే అయ్యారు. ఈ నేపధ్యంలో తాజాగా వచ్చిన ఏ మాయ చేసావే వైపు యువత మ్రొగ్గు చూపటంతో లీడర్ కు మైనస్ గా మారిందని చెప్తున్నారు. అప్పటికీ కొన్ని చోట్ల లీడర్ కలెక్షన్స్ డ్రాప్ అవటంతో సెకెండాఫ్ ట్రిమ్ చేసి వదిలారు. అయినా పెద్దగా ఫలితం కనపడటం లేదంటున్నారు. శేఖర కమ్ముల మీద అభిమానం ఉన్న వర్గాలు దానిని ఆదరిస్తున్నా ఆ కలెక్షన్స్ రెండు వారాలకే అయిపోయాయని, ఇప్పుడు కొత్త సెంటర్లు, రిపీట్ ఆడియన్స్ కావాలని చెప్తున్నారు. ఇక ఏ మాయ చేసావే...మల్టీఫ్లెక్స్ లలో హౌస్ ఫుల్స్ తో ముందుకువెళ్ళుతోంది. రొమాంటిక్ ఫిల్మ్ కావటం ఈ చిత్రానికి ఫ్లస్ గా మారింది. అదే లీడర్ కి మైనస్ గా మారిందని విశ్లేషిస్తున్నారు. ఏదైమైనా రెండు చిత్రాలు రెగ్యులర్ మూస లోకి వెళ్ళకుండా కొత్తగా ప్రయత్నించినవే కావటం విశేషం. అలాగే హీరోరు..రాణా, నాగచైతన్య ఇద్దరూ రామానాయుడు మనవలే..

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu