»   » నాకు 'కలర్‌ ఫుల్‌' హోలీ...'లీడర్‌' హీరోయిన్

నాకు 'కలర్‌ ఫుల్‌' హోలీ...'లీడర్‌' హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

శేఖర్ కమ్ముల రూపొందించిన 'లీడర్‌' చిత్రంతో పరిచయమైన బెంగాళీ భామ రిచా గంగోపాధ్యాయ. ఆమె తొలి చిత్రం 'లీడర్‌' చిత్రం విజయవంతం కావటంతో హోలీ హ్యాపీగా జరుపుకుంటున్నానంటోంది. ఆ విషయాన్ని ఆమె మీడియాతో వివరిస్తూ...'లీడర్‌' విజయానందంలో ఉన్న నేను హోలీని రెట్టింపు ఆనందంతో జరుపుకుంటాను. సినిమా పరిశ్రమ 'కలర్‌ఫుల్‌'గా ఉంటుంది కాబట్టి నా జీవితం కూడా అదే విధంగా ఉంది. హోలీ రంగులతో మరింత కలర్‌ ఫుల్‌ అయిపోతాను అంటోంది. అలాగే హోలీ పండగను నేను మొట్టమొదటి సారి జరుపుకున్నది గత ఏడాదే. అంతకుముందు యూఎస్‌ లో ఉండటంవల్ల భారతీయ పండగలకు దాదాపు దూరమయ్యాను. ముంబయ్‌లో అడుగుపెట్టిన తర్వాత మాత్రం పండగలను మిస్‌ కావడంలేదు. అయితే పోయిన ఏడాది హోలీ జరుపుకున్నప్పుడు నేను మామూలు అమ్మాయిని. ఈసారి హీరోయిన్‌గా మీ అందరకీ పరిచయం అయ్యాను. నా జీవితంలో మంచి మార్పు తెచ్చిన హోలీ ఇది అని మురిసిపోతూ చెప్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu