»   » లీడర్ 'స్వప్నం' కాదు... సత్యం: శేఖర్ కమ్ముల

లీడర్ 'స్వప్నం' కాదు... సత్యం: శేఖర్ కమ్ముల

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు సినిమా ఉజ్వల భవిష్యత్తుపై నమ్మకాన్ని పెంచిన వర్తమాన దర్శకులలో శేఖర్ కమ్ముల ఒకరు. ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్ వంటి మంచి సాఫ్ట్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన దర్శకుడు శేఖర్ కమ్ముల చేసిన మరో మంచి ప్రయత్నం లీడర్. ప్రఖ్యాత ఏవీఎం సంస్థ నిర్మించిన ఈ చిత్రం ద్వారా డాక్టర్ రామానాయుడు మనవడు, సురేష్ బాబు కుమారుడు రాణా కథానాయకుడిగా పరిచయం చేశారు.

తెలుగు ప్రేక్షకులలో ఎన్నో అంచనాలు ఉన్న ఈ చిత్రం ఫిబ్రవరి 19న విడుదలవుతోంది. ఈ నేపధ్యంలో లీడర్ చిత్రం స్వప్నం కాదు...సత్యమని చెపుతున్న చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల. రాజకీయనాయకుడికీ, నాయకుడికి తేడా ఏమిటో చూపించే చిత్రం. రాజకీయ రంగాన్ని స్ఫూర్తిగా తీసుకోవలసినవారు క్రమంగా తగ్గిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో లీడర్ అనేవాడు ఎలా ఉండాలో చెప్పే చిత్రం. అందరికీ ఆదర్శంగా ఉండే లీడర్ చిత్రంలో కనిపిస్తాడు.

మా లీడర్ రాజకీయాలు ఇలా ఉంటే బాగుంటుంది అని చెపుతోంది. లీడర్ అనేవాడు ఇలా ఉండాలి అని చెపుతుంది. అయితే ఈ సినిమా కారణంగానే రాజకీయాల్లో మార్పు వచ్చేస్తుందని గట్టిగా చెప్పలేకపోయినా, ఈ సినిమా ద్వారా రాజకీయాల్లో మార్పు వస్తే సంతోషిస్తానని చెప్పగలను. ఈ సినిమా రాజకీయ రంగంలో ఉన్నవారిని కొంతయినా ఆలోచింపజేస్తుందన్న నమ్మకం ఉందని అంటున్నారు కమ్ముల. లీడర్ లో ఆ సబ్జెక్ట్ కి స్టార్ కంటే కొత్త హీరోనే ఖచ్చితంగా నచ్చుతాడు. ఎందుకంటే స్టార్స్ నటించే చిత్రాలు ఓ డ్రీమ్ లా ఉంటాయి. కానీ లీడర్ సినిమా స్వప్నం కాదు...సత్యం. ఆ సత్యాన్ని సత్యంలా ప్రేక్షకులు చూడాలంటే చిత్రంలో ప్రధాన పాత్రను కొత్త నటుడే చేయాలని అందుకే రాణాను ఎంపిక చేసుకున్నానన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu