»   » ఎగ్గొట్టి తెగ్గొట్టి 'లీడర్' ను తగ్గించేసారు..!!

ఎగ్గొట్టి తెగ్గొట్టి 'లీడర్' ను తగ్గించేసారు..!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామానాయుడి గారి మనవడు రాణాని హీరోగా పరిచయం చేస్తూ క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన సినిమా లీడర్. నేటి రాజకీయ పరిణామాణాలను కథాంశంగా ఎంచుకొని తీసిన ఈ సినిమా మొదటి వారం డివైట్ టాక్ తెచ్చుకుంది. ఈ డివైడ్ టాక్ కు ప్రధాన కారణం ద్వితియార్థం అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ప్రథమార్థం బాగానే వున్నా ద్వితియార్థం మాత్రం డాక్యుమెంటరీ లాగా సాగుతూనడిచిందనే విమర్శలు వినిపించాయి.

దీంతో ఈ సినిమాలో సెకెండ్ ఆఫ్ ను 15 నిమిషాల మేర ట్రిమ్ చేసారని తెలుస్తోంది. ఆడియెన్స్ బోర్ గా ఫీల్ అవుతున్న సన్నివేశాలను ట్రిమ్ చెయ్యడం ద్వారా లీడర్ సినిమాకు ఆదరణ పెరుగుతుందని దర్శకనిర్మాతలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu