»   » శేఖర్ కమ్ముల 'లీడర్' చిత్రం రిలీజ్ డేట్?

శేఖర్ కమ్ముల 'లీడర్' చిత్రం రిలీజ్ డేట్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామానాయుడు మనవడు రాణాను హీరోగా పరిచయం చేస్తూ శేఖర్ కమ్ముల రూపొందించిన 'లీడర్' చిత్రం పిబ్రవరి 11వ తేదీన రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అప్పటికి రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న అనిశ్చితి తొలిగి ఏ విధమైన అడ్డంకులు రాకుండా విడుదల అయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇక ఈ చిత్రం కూడా ఓ పొలిటికల్ ధ్రిల్లర్ కావటంతో మరింత జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ప్రోమోలకు మంచి రెస్పాన్స్ వచ్చిందని యూనిట్ సంతోషంతో ఉన్నారు. అలాగే ఈ చిత్రంలో రాణా సరసన చేస్తున్న ప్రియా ఆనంద్, రిచా గంగోపాద్యాయ హీరోయిన్స్ గా పరిచయం అవుతున్నారు. శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ ద్వారా పరిచయం అయ్యి బిజీ అయిన మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఆ పాటలు ఇప్పటికే మార్కెట్లో మంచి పాపులర్ అయ్యాయి. ప్రఖ్యాతి చెందిన ఎవియం బ్యానర్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రం రిలీజ్ కాకముందే రాణా హిందీలోనూ అబిషేక్ బచ్చన్ సరసన ఆఫర్ పొందటం మరో విశేషం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu