»   » శేఖర్ కమ్ముల 'లీడర్' విడుదల ఫోస్ట్ ఫోన్

శేఖర్ కమ్ముల 'లీడర్' విడుదల ఫోస్ట్ ఫోన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

పిబ్రవరి 11వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించిన లీడర్ చిత్రం మరోసారి వాయిదా పడింది. ఈ చిత్రాన్ని పిబ్రవరి 19న రిలీజు చేయటానికి నిర్ణయించారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఎవియం ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం ఆంధ్రా పంపిణీ హక్కులను ఠాగూర్ మధు తీసుకున్నారు. ఠాగూర్ మధు రీసెంట్ గా అవతార్ ని తెలుగులోకి డబ్బింగ్ చేసి విజయం సాధించారు. ఇక ఈ చిత్రం ద్వారా ప్రముఖ నిర్మాత రామానాయుడు మనవడు రాణా తెలుగు పరిశ్రమకు హీరోగా పరిచయం అవుతున్నాడు. అలాగే ఇప్పటివరకూ అపజయం ఎరగని మినిమం గ్యారెంటీ దర్శకుడుగా శేఖర్ కమ్ములకు పేరుండటంతో ఈ చిత్రంపై మరిన్ని అంచనాలు ఉన్నాయి. రాజకీయాల నేపధ్యంలో జరిగే ఈ కథలో ముఖ్యమంత్రి ప్రమాదవశాత్తు చనిపోతే ఆయన కుమారుడు ముఖ్యమంత్రి అవటం ప్రధానాంశంగా ఉంటుందని తెలుస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu