»   » ఆ సినిమా నిర్మాత వేరొకరైతే రాష్ట్రం రావణ కాష్టం అయ్యేదేమో!

ఆ సినిమా నిర్మాత వేరొకరైతే రాష్ట్రం రావణ కాష్టం అయ్యేదేమో!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎవియం వారి 'లీడర్" చిత్ర కథ తమవారే రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలన్నదే పెద్దాయన (కోట శ్రీనివాసరావు)కోరిక. ఆ ప్రకారం మఖ్యమంత్రి అయిన నాయకుడు(సుమన్) బాంబు బ్లాస్టింగ్ తో ప్రాణాలు విడుస్తారు. విదేశాలలో వున్న ఆయన కుమారుడు (రానా) తండి(సుమన్)-తల్లి(సుహాసిని) కోరిక మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కావడానికి చేసిన ప్రయత్నాలు-ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన సంఘటనలే ఈ చిత్ర కథ.

యాదృశ్చికంగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చనిపోవడం, ఆయన కుమారుడు ముఖ్యమంత్రి గద్దెనెక్కడానికి ప్రయత్నించడం జరిగింది. అయితే లీడర్ సినిమా ప్రమోషన్ లో ఎక్కడా ఈ అంశాన్ని ప్రస్తావించలేదు. ఇక్కడే సినిమా ప్రమోటర్స్ ముందుచూపు బయటపడింది. పొరపాటున ఈ సినిమా కథ రాష్ట్ర రాజకీయానికి దర్సణం అన్న ఒక్క వాక్యం వాడితేచాలు జరగవలసిన అనర్థం జరగేది.

సినిమాలో ముఖ్యమంత్రి అవినీతి మార్గంలో కోట్లు కూడగట్టాడు. ఎమ్మెల్లేలు కూడా అమ్ముడు పోయారు. మంత్రులయితే సరేసరి! పార్టీ హై కమాండ్ ఎజెండా కూడా స్వార్థమే! ఇటువంటి చిత్ర కథని ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితితో పోల్చకుండా చాలా చాలా మంచిపని చేశారు. లేకుంటే రిలియన్స్ ఆస్తులకు పట్టినగతే రాష్ట్రానికి పట్టేది. ఈ విషయంలో లీడర్ ప్రమోటర్ సురేష్ బాబు విజన్ కి నమస్కరించాలి. 'సలీం" విడుదలయిన తర్వాత మోహన్ బాబు తిరుపతిలో చేసిన ప్రకటన, 'అదుర్స్" విడుదలయిన తర్వాత కొడాలినాని చేసిన ప్రకటన ఎటువంటి ప్రకంపనలు సృష్టించాయో తెలుసుకదా! అదే సురేష్ బాబు గొప్పతనం!

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu