»   » రాణా సత్తాను చూసి జూ ఎన్టీఆర్ బెదుర్స్!

రాణా సత్తాను చూసి జూ ఎన్టీఆర్ బెదుర్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

కుర్ర హీరోల్లో ఎవరి ఫాలోయింగ్ వారికే సొంతంగా ఉంటుంది. కానీ కొంత మంది నూతన కథానయకుల స్టామినా చూసినప్పుడు అప్పటికే ఫీల్డలో ఉన్న యువ హీరోలకు గుబులు పట్టుకుంటుంది. ప్రస్తుతం అటువంటి గుబులులో జూనియార్ ఎన్టీఆర్ ఉన్నాడని టాలీవుడ్ సినీజనం అంటున్నారు. శేఖర్ కమ్ముల చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయమైన 'లీడర్" రానా, తొలి చిత్రంతోనే సూపర్ మార్కులు కొట్టేశాడు. బేస్ నుంచి వాయిస్ దాకా దుమ్ములేపాడు. దానికి తోడు అతని హావభావాలు సైతం చూడముచ్చటగా ఉన్నాయని చూసిన జనం అంటున్నారు.

అంతేకాదు...ఇటీవల లీడర్ సక్సెస్ నేపధ్యంలో ఓ ఫంక్షన్ ఏర్పాటు చేస్తే.. అక్కడ స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆయా పౌరాణికాల్లో వల్లెవేసిన భారీ డైలాగులను ఏకబిగిన చెప్పేశాడట. దీంతో అక్కడున్న నందమూరి ఫ్యాన్స్ అంతా ఒకటే ఈలలు...చప్పట్లట. వీటిని ఆస్వాదించినవారు, రానాకు పౌరాణిక, చారత్రక సినిమాల్లోనూ నటించే సత్తా ఉందని చాలా మంది అతనిపై పొగడ్తల వర్షం కురిపించారట. పొడగరి కూడా అయిన రానా, నాడు ఎన్టీఆర్ పౌరాణిక చిత్రాల్లో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకున్నారో...అలాగే రానా కూడా ఆకట్టుకోగలరని అన్నారట.

మరికొందరు ఒకడుగు ముందుకు వేసి ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ చిత్రాన్ని రానాతో తీస్తే బావుంటుందని సలహాలు కూడా ఇచ్చేశారు. అంతేకాదు కురచగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ పవర్‌ఫుల్ క్యారెక్టర్ అయిన దుర్యోధనుని పాత్రలో అంతగా రాణించలేరని ఉచిత సలహా కూడా ఇచ్చేశారట. ఈ వార్త ఆ నోటా..ఈ నోటా..జూనియర్ ఎన్టీఆర్‌ చెవికి చేరినట్లు భోగట్టా. తన స్టామినాతో రానా స్టామినాను పోల్చడంపై విని తల పంకించారని సమాచారం. మరి నందమూరి ఫ్యాన్స్ రానాకు జై అంటే జూనియర్ నిజంగా అదుర్సే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu