For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రోబో 2.0 అసలు ఏది నిజం కథ..? సుజాత ఎవరు?? అన్నీ అనుమానాలే

  |

  శంకర్ పక్కా ప్లానింగ్ తో 'రోబో 2.0' సినిమా షూటింగ్ జరిగిపోతోంది. ఈ సినిమాలో రజనీకాంత్ - ఎమీ జాక్సన్ నాయకా నాయికలుగా కనిపించనున్నారు. ఇక విలన్ గా అక్షయ్ కుమార్ నటిస్తుండటం విశేషం. ఈ సినిమాలో మరో బాలీవుడ్ నటుడు కూడా నటిస్తున్నాడు .. ఆయనే సుధాన్షు పాండే.

  ఈ సినిమాలో తాను డాక్టర్ బోరా కొడుకు పాత్రలో కనిపిస్తానని ఆయనే స్వయంగా చెప్పాడు. తన పాత్ర కూడా నెగెటివ్ షేడ్స్ తోనే ఉంటుందనీ, అక్షయ్ కుమార్ కి .. తనకి మధ్య ఒక భారీ ఫైట్ కూడా ఉందని అన్నాడు. తన పాత్రలో నెగెటివ్ షేడ్స్ వున్నా, విలన్ మాత్రం అక్షయ్ కుమారేనని చెప్పాడు. ఈ సినిమాలో తాను పోషిస్తోన్న పాత్ర తనకి మంచి పేరు తీసుకువస్తుందనే నమ్మకం ఉందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ఈ సినిమా మరిన్ని విశేషాలు...

  రోబో కు సీక్వెల్‌గా:

  రోబో కు సీక్వెల్‌గా:

  అత్యంత ప్రతిష్టాత్మకంగా సూపర్ హిట్ చిత్రం ‘రోబో' కు సీక్వెల్‌గా శంకర్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం ‘2.0' . ఈ చిత్రం కోసం రజనీకాంత్‌ ఎంతగానో శ్రమిస్తున్నారు.

  అదనంగా మరో పాత్రలోనూ:

  అదనంగా మరో పాత్రలోనూ:

  అంతకుతగినట్లుగానే ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో చిత్రం గురించి ఓ స్పెషాలిటీ బయిటకు వచ్చింది. అదేమిటంటే...రోబో చిత్రంలో రజనీకాంత్ వశీకరన్, చిట్టీ పాత్రల్లో నటించారు. ఆ చిత్రం అమోఘ విజయాన్ని సాధించింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా రూపొందుతున్న 2.0 చిత్రంలో రజనీ అదనంగా మరో పాత్రలోనూ కనిపించనున్నారన్నది తాజా సమాచారం.

  అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో:

  అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో:

  రోబో 2 పై భారీ అంచనాలే వున్నాయి. ఈ సినిమాని శంకర్ ఎలాంటి కథతో తీస్తున్నాడు..రోబోని మించిన విన్యాసాలు ఇందులో వుంటాయా? అనే వాటిపై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లేటెస్ట్ కోలీవుడ్ వర్గాల టాక్ ప్రకార౦..రోబో -2 కథ లీకైందట . లీక్ అయిన స్టొరీ కూడా కొంచెం ఆసక్తికరంగానే వుంది. ఆ కథ ఏమిటంటే... రోబో -2 లో రజినీకాంత్ వశీకరణ్ అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో అన్నిటికంటే పవర్ ఫుల్ రోబో అక్షయ్ కుమార్ ని తయారుచేస్తాడట.

  రీ మోడిఫై:

  రీ మోడిఫై:

  అయితే అతను వశీకరణ్ మాట వినకుండా విలన్ ల పక్కన చెరి దేశనాశనం కోసం పనిచేస్తాడట. అప్పుడు అక్షయ్ ఎలాగైనా ఎదుర్కొనేందుకు వశీకరణ్ మళ్ళీ చిట్టీని రంగంలోకి దింపుతాడట. మునుపటి కంటే చిట్టీని అడ్వాన్స్ డ్ టెక్నాలజీ తో రీ మోడిఫై చేస్తాడట వశీకరణ్. దాంతో చిట్టీ అక్షయ్ కుమార్ ఎలా అడ్డుకుంది. విలన్ గ్యాంగ్ ఆట ఎలా కట్టించింది అనేది ఈ సినిమాలో ఆసక్తికరంగా వుండబోతుందట.

  అసాధారణ రీతిలో:

  అసాధారణ రీతిలో:

  మరోవైపు అక్షయ్, చిట్టీల మధ్య పోరాట సన్నివేశాలు అసాధారణ రీతిలో ప్లాన్ చేశాడట శంకర్. ఈ సన్నివేశాలు హాలీవుడ్ సినిమాలను తలపిస్తాయట. ఈ సన్నివేశాల కోసం భారీ రేంజులో డబ్బులు ఖర్చు పెట్టబోతున్నారట. అయితే ఇది బయటికి వినిపించే ఒక వెర్షన్ అయితే దీనికి ఇంకో వెర్షన్ కథ కూడా సోషల్ మీడియాలో కనిపిస్తోంది.

  అక్షయ్ కుమార్ మనిషే:

  అక్షయ్ కుమార్ మనిషే:

  అసలు అక్షయ్ కుమార్ మనిషే కానీ సాధారణ వ్యక్తులని కూడా బలవంతులుగా తయారు చేయటానికి రక రకాల ప్రయోగాలు చేస్తూ. ఒక మందుని తన మీదే ప్రయోగించుకొని వికౄతంగా తయారవటాడు. ఇతన్ని అక్షయ్ కుమార్ దగ్గరే పని చేసే అతని స్టూడెంట్ అయిన "బోరా" (పాత రోబోలో చిట్టి ని విలన్ గా చేసే సైంటిస్ట్) కొడుకు కంట్రోల్లో పెట్టుకొని విద్వంసం సృష్టించాలనుకుంటాడు. అలా రంగం మీదకి వచ్చిన ఈ విలన్ ని ఎదుర్కోవటానికి "చిట్టి" ని దింపుతాడు వశీకర్.

   విలన్ గానే ఎక్కువ పాపులర్ :

  విలన్ గానే ఎక్కువ పాపులర్ :

  నిజానికి మొదటి రోబోలో "చిట్టి" అనే పాత్ర విలన్ గానే ఎక్కువ పాపులర్ అయ్యింది. కానీ ఈ రెండో పార్ట్ లో మాత్రం చిట్టిని హీరో లాగానే ఉంచబోతున్నాడట శంకర్. చిట్టీ క్యారెక్టర్ లో అతడు చేసిన విన్యాసాలు అసాధారణం. విలన్ గా మారాక విరోచితమైన పెర్ఫామెన్స్ చూపించారు రజనీ. అయితే ఇప్పుడు ఆ చిట్టీ క్యారెక్టర్ 2.0లో హైలైట్ గా ఉంటుందని సమాచారం.

  ఈ సుజాత ఎవరూ :

  ఈ సుజాత ఎవరూ :

  ఇక పోతే రోబో 2.0 విజయావకాశాల మీద కూడా ఆశగా ఉన్న్ శంకర్ ఈ సారి కథ మీద కూడా దృష్టి గట్టి గానే పెట్టాడట. ఇండస్ట్రీలోని వ్యక్తులు మాత్రమే కాక ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ సైతం ..తన ఫిల్మోగ్రఫీ..రెండు పార్ట్ లు చేస్తే... సుజాతతో, దురదృష్టవశాత్తు సుజాత లేకుండా అని విభజించాలని చెప్తూంటారు. ఇంతకీ ఈ సుజాత ఎవరూ అంటే..

  బాలకుమురన్ : '

  బాలకుమురన్ : '

  శంకర్ సూపర్ హిట్స్ అన్నిటికి దాదాపు కథలు ఆయనవే. శంకర్ సినిమాలకు మూల కథలు చాలా వరకు ఆయనవి కావు. స్క్రీన్ ప్లేలు మాత్రమే ఆయన తయారుచేసుకుంటారు. ప్రారంభంలో బాలకుమురన్ అనే సుప్రసిద్ధ తమిళ రచయిత శంకర్ సినిమాలకు కథలు అందించారు. తర్వాత సుజాత పేరుతో కథలు చేసారాయన. ఈ బాలకుమురన్ తమిళ హిట్ సినిమాలకు రచయిత.

  దృష్టి మొత్తం టెక్నాలజీ మీదనే:

  దృష్టి మొత్తం టెక్నాలజీ మీదనే:

  కమల్ హాసన్ గుణ, రజనీ భాషా, శింబు మన్మధ సినిమాల కథలు కూడా ఆయనవే. దాంతో ఆయన అండతో శంకర్ విజయాలు సాధించారు. తర్వాత సుజాత అండతో పెద్ద హిట్స్ కొట్టారు. కానీ సుజాత మరణం తర్వాత ఆయన చేసిన చిత్రం ఐ డిజాస్టర్ అయ్యింది. ఐ చూసిన ప్రతీ ఒక్కరూ ..శంకర్ కేవలం దృష్టి మొత్తం టెక్నాలజీ మీదనే పెట్టారని , కథను విస్మరించారని చెప్తారు. మరి కథను విస్మరించటానికి ..సుజాత లాంటి రచయిత శంకర్ కి దొరక్క పోవడమే అంటున్నారు ప‌రిశీల‌కులు.

  English summary
  In Robo first part, according to the court statement, Chitti Robo has been destroyed and put in a science museum to show for students. Now as per Robot 2 leaked story, Scientist Vasikaran will be once gain used Chitti Robo to destroy another powerful Robo which will be played by Akshay Kumar.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X