»   » లీకై షాకిస్తోంది: 'కంచె' లో వరుణ్ తేజ లుక్

లీకై షాకిస్తోంది: 'కంచె' లో వరుణ్ తేజ లుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్:'ముకుంద' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ రెండో సినిమా 'కంచె'... ఫిబ్రవరి 27న పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఆయన తండ్రి జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ లాంటి ఫొటో ఒకటి లీకై అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కావాలని లీక్ చేసారో లేక పొరపాటున బయిటకు వచ్చిందో కానీ ఈ ఫొటో చూసిన వారు మాత్రం షాక్ అవుతున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ మూవీలో వరుణ్ తేజ్ సరసన 'డేగ, మిర్చిలాంటి కుర్రాడు' చిత్రాలలో నటించిన ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. దానికి సంబంధించిన వర్కింగ్ స్టిల్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దసరా కానుకగా ఈ సినిమా విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.

Read More:వరుణ్ తేజ్ ‘కంచె' కోసం భారీ సెట్ (ఫోటో)

వరుణ్ తేజ్- క్రిష్ మూవీ లొకేషన్లో ఇలా.. (ఫోటో)

LEAKED: Varun Tej's Look From Kanche

ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధ నేపధ్యంలో ఈ సినిమా కథ ఉంటుందట. పీరియాడికల్ డ్రామాగా రూపొందబోయే ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఇండియన్ ఆర్మీ సోల్జర్ గా నటిస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.

తొలి సినిమాతోనే మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. దీనికి తోడే మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అండ ఉండనే ఉంది. అందుకే రెండో సినిమాకే రెమ్యూనరేషన్ రూ. 3 కోట్లు తీసుకుంటున్నాడట. దీని తర్వాత 'బెంగుళూర్ డేస్' రీమేక్ లో చేస్తున్నారు.

మలయాళంలో ఘన విజయం సాధించిన 'బెంగుళూర్ డేస్' చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో పొట్లూరి వర ప్రసాద్, దిల్ రాజు సంయుక్తంగా రీమేక్ చేయబోతున్నారు. బుధవారం ఈ సినిమా తమిళ రీమేక్ పూజా కార్యక్రమాలు చెన్నయ్ లో జరిగాయి.

రానా, ఆర్య, బాబీ సింహా, శ్రీదివ్య, లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే తెలుగు రీమేక్ కు మాత్రం 'ఓ మై ఫ్రెండ్' ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది.

English summary
Varun Tej, who scored a dud with his debut film, Mukunda, is putting his hundred percent in to his next, Kanche, under the direction of Krish. The shooting of the film is currently going on in Georgia and a still from the shooting spot leaked online. Varun Tej was seen sporting a look of an army man with a trimmed mustache and clean shaved, with a pistol in hand.
Please Wait while comments are loading...