»   » 'లెజెండ్‌' అని ఎందుకు పెట్టారో...: చంద్రబాబు ('లెజెండ్‌' 400 డేస్)

'లెజెండ్‌' అని ఎందుకు పెట్టారో...: చంద్రబాబు ('లెజెండ్‌' 400 డేస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ''నా జీవితంలో ఇప్పటివరకు ఏ సినిమా కార్యక్రమానికి మూడు గంటలు కేటాయించలేదు. ఈ కార్యక్రమానికే ఇంత సమయం కేటాయించాను. మా అభిమాన నాయకుడు నందమూరి తారకరామారావు గురించి ఓ వీడియో చూపించి నాకెంతో ఆనందం కలిగించారు. ఈ సినిమాకు 'లెజెండ్‌' అనే పేరు ఎందుకు పెట్టారో తెలియదు కానీ... లెజెండరీ విజయం సాధించి చరిత్ర సృష్టించింది. '' అన్నారు.ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

చలనచిత్ర రంగంలో చరిత్ర సృష్టించిన లెజెండ్‌ విజయోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సినీనటుడు బాలకృష్ణతో పాటు చిత్ర తారాగణం ఈ కార్యక్రమంలో పాల్గొంది.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


శనివారం రాత్రి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన 'లెజెండ్‌' 400 రోజుల వేడుకకు చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చిత్రమిది. రాధికా ఆప్టే, సోనాల్‌ చౌహాన్‌ నాయికలు. బోయపాటి శ్రీను దర్శకుడు. అనిల్‌ సుంకర, రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట నిర్మాతలు. సాయి కొర్రపాటి సమర్పకుడు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు చిత్రబృందానికి జ్ఞాపికలు అందజేశారు.


‘సింహా'లో రాయల్‌గా కనిపించే బాలయ్యబాబును కాస్త మీటర్‌ పెంచి ఇందులో జనం కోసం పాటుపడే వ్యక్తిగా చూపించారు. 100 సినిమాల్లో ఫ్యామిలీ హీరోగా చేసిన జగపతిబాబును విలన్‌గా పరిచయం చేశారు. బాలయ్యబాబు పవర్‌ని తట్టుకోవాలంటే ఎదురుగా బలమైన వ్యక్తి తప్పకుండా ఉండాలి. జగపతిబాబుగారు ఆ రోల్‌కి సంపూర్ణమైన న్యాయం చేశారు.''


స్లైడ్ షోలో... 400 డేస్


చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ

చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ

''చరిత్ర సృష్టించడం నందమూరి వంశానికే సాధ్యం. నాడు ఎన్టీఆర్‌ ఎన్నో విజయాలు సాధించారు. ఇప్పుడు బాలకృష్ణ దాన్ని కొనసాగిస్తున్నారు. బాలకృష్ణ సినిమాల్లోనే కాదు... హిందూపురం ఎమ్మెల్యేగా సేవ చేస్తూ నిజమైన హీరోగా నిలిచార''న్నారు


చంద్రబాబు నాయుడు కంటిన్యూ చేస్తూ..

చంద్రబాబు నాయుడు కంటిన్యూ చేస్తూ..

బోయపాటి, బాలకృష్ణదివిజయాల కాంబినేషన్‌. బాలకృష్ణ వందో సినిమాకూ ఓ మంచి కథ సిద్ధం చేయమని బోయపాటిని కోరుతున్నా. ఆ సినిమా వెయ్యి రోజులు ఆడాలని ఆశిస్తున్నా


బాలకృష్ణ మాట్లాడుతూ ...

బాలకృష్ణ మాట్లాడుతూ ...

''ఎమ్మిగనూరులో 'లెజెండ్‌' సినిమా 400 రోజులు ఆడటం ఆనందంగా ఉంది. ఇంతమంది అభిమానం పొందడం నా పూర్వజన్మ సుకృతం. ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంటే మా ఇంట్లో జరుగుతున్నట్లుంది. చరిత్ర సృష్టించాలన్నా మేమే..చరిత్రను తిరగరాయాలన్నా మేమే.''అన్నారు


బాలకృష్ణ కంటిన్యూ చేస్తూ...

బాలకృష్ణ కంటిన్యూ చేస్తూ...

చంద్రబాబు నాయుడు రోజుకు 20 గంటలపాటు కష్టపడి రాష్ట్ర అభ్యున్నతికి కృషి చేస్తున్నారు. ఆయనకు ఎన్నో పనులున్నప్పటికీ నందమూరి అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తల కోసం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయనకు నా కృతజ్ఞతలు''అన్నారు.


బోయపాటి శ్రీను మాట్లాడుతూ....

బోయపాటి శ్రీను మాట్లాడుతూ....

''నా' అనుకునే వాళ్లను దగ్గరకు తీసుకొని ఆదరించడం నందమూరి, నారా వంశాల లక్షణం. రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్ర ప్రాంతం ఏమైపోతుందో అని అందరూ అనుకున్నారు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతో అదృష్టాంధ్రప్రదేశ్‌గా మారింది.


బోయపాటి కంటిన్యూ చేస్తూ..

బోయపాటి కంటిన్యూ చేస్తూ..

దూరదృష్టి ఉన్న నాయకుడు చంద్రబాబు. కష్టపడటం, ప్రజలంటే ఇష్టపడటం... ఇదే చంద్రబాబు, బాలకృష్ణలు నమ్మిన సూత్రం. ఓ సినిమా నాలుగు వారాలు ఆడటమే గగనమైన ఈ రోజుల్లో, ఓ సినిమా 400 రోజులు ఆడటం గొప్ప విషయమ''న్నారు.


జగపతిబాబు మాట్లాడుతూ....

జగపతిబాబు మాట్లాడుతూ....

''బాలకృష్ణ చాలా మంచి మనిషి. ఆయనతో మరో సినిమా చేయాలనుంది'' అన్నారు.సాయి కొర్రపాటి మాట్లాడుతూ....

సాయి కొర్రపాటి మాట్లాడుతూ....

''బాలకృష్ణ మాపై ఎంతో నమ్మకముంచి ఈ సినిమా ఇచ్చారు. 'లెజెండ్‌'పేరుతో వచ్చి లెజెండరీ విజయం సాధించింది. ఈ సినిమా విజయంలో బోయపాటి శ్రీను కృషి ఎంతగానో ఉంది. బాలకృష్ణగారు మరోసారి సినిమా చేసే అవకాశమివ్వాలని కోరుకుంటున్నామ''న్నారు.


ఎవరెవరు...

ఎవరెవరు...

కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, నీటి పారుదల శాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి, తెదేపా నాయకులు, చిత్ర ప్రముఖులు రామ్‌ లక్ష్మణ్‌, రత్నం, సమీర్‌ తదితరులు పాల్గొన్నారు.విమర్శలు

విమర్శలు

రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అవేమి పట్టించుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బాలకృష్ణ సినిమా విజయోత్సవ వేడుకలకు రావడం విడ్డూరంగా ఉందని కేంద్రమాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి విమర్శించారు.హిట్టిచ్చాడు

హిట్టిచ్చాడు

2014లో సరైన హిట్టు ఒక్కటీ లేదే అనుకుంటున్న తరుణంలో సరిగ్గా బోయపాటి 'లెజెండ్‌'ని రంగంలోకి దించాడు. ఈ ఏడాదిలోనే బ్లాక్‌బస్టర్‌ హిట్‌ని పరిశ్రమకు ఇచ్చాడు. అటు ప్రేక్షకుల్ని కేరింతలు కొట్టించాడు.


అసలైన సింహాన్ని...

అసలైన సింహాన్ని...

ఈ క్రెడిట్‌ పూర్తిగా నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనులదే. బాలయ్యలో అసలైన సింహాన్ని తెరపైకి తెచ్చాడు. యాక్షన్‌లో ఉగ్రనరసింహుడిని చూపించాడని ఫ్యాన్స్ అంటున్నారు.


ప్లస్ అయ్యింది

ప్లస్ అయ్యింది

లెజెండ్‌ గర్జనతో థియోటర్స్ మార్మోగిపోయాయి. కుటుంబ ప్రేక్షకుల కోసం చక్కని సెంటిమెంట్‌ రంగరించి వదలటం ప్లస్ అయ్యింది. ముఖ్యంగా ...

ముఖ్యంగా ...

సెకండాఫ్ లో సెంటిమెంట్‌, ట్రెయిన్‌ ట్రాక్‌పై ఎపిసోడ్‌లో ప్రేమ సన్నివేశం ప్రేక్షకుడి గుండె పగిలిపోయే ఉద్వేగాన్ని ఇచ్చాయి.ఇంకో హైలెట్

ఇంకో హైలెట్

గుడిమెట్లపై బాలయ్య ఉగ్రరూపం యాక్షన్‌కే కొత్త హంగులు అద్దింది. మాస్‌ యాక్షన్‌ ప్రియులకు ఇదో కన్నుల పండుగగా మారింది.వణుకుద్దీ...

వణుకుద్దీ...

'నీకు బీపీ వస్తే నీ పీఏ వణుకుతాడేమో.. నాకు బీపీ వస్తే ఏపీ వణుకుద్దీ..' అంటూ నందమూరి బాలకృష్ణ పలికిన సంభాషణలు పెద్ద హిట్టయ్యాయి.అందుకే మరుపురాని విజయం

అందుకే మరుపురాని విజయం

బోయపాటి శ్రీను దర్శకత్వ శైలి, రెండు పాత్రల్లో చూపించిన వైవిధ్యం, కథ కథనాలు, దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం వెరసి 'లెజెండ్‌'కి మరపురాని విజయాన్ని అందించాయి. 'సింహా' తరవాత బాలకృష్ణ-బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన చిత్రం 'లెజెండ్‌'. 2014లో 'లెజెండ్‌' మర్చిపోలేని విజయాన్ని నమోదు చేసుకొంది.కీలకపాత్రలే..

కీలకపాత్రలే..

నందమూరి బాలకృష్ణ అభినయం, ఆయన పలికిన సంభాషణల తీరు,భోయపాటి శ్రీను దర్శకత్వ ప్రతిభ, వారాహి చలన చిత్రం మరియు 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ప్ నిర్మాణ విలువలు, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రం సాధిస్తున్న సంగీతం ఈ చిత్రం సాధిస్తున్న సంచలన విజయంలో కీలక పాత్ర పోషించాయి.విశేషం...

విశేషం...

ముఖ్యంగా బోయపాటి శ్రీను తన 5వ చిత్రంతోనే 50 కోట్ల క్లబ్ లో స్థానం సంపాదించుకోవడం విశేషం.


టెక్నీషియన్స్..

టెక్నీషియన్స్..

చిత్రం: లెజెండ్‌ సంస్థ: 14 రీల్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌, వారాహి చలనచిత్రం నటీనటులు: నందమూరి బాలకృష్ణ, జగపతిబాబు, సోనాల్‌ చౌహాన్‌, రాధికా ఆప్టే, సితార, రావు రమేష్‌, ఈశ్వరీరావు తదితరులు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌ పాటలు:రామ జోగయ్య శాస్త్రి మాటలు: ఎం. రత్నం ఛాయాగ్రహణం: సి. రామ్ ప్రసాద్ యాక్షన్: రామ్-లక్ష్మణ్,కనల్ కణ్ణన్ ఆర్ట్: ఏయస్ ప్రకాష్ ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు నిర్మాతలు: అనిల్‌ సుంకర, గోపీచంద్‌ ఆచంట, రామ్‌ ఆచంట, సమర్పణ: సాయి కొర్రపాటిEnglish summary
The makers of ‘Legend’ organised a lavish function at Yemmiganur on Saturday night to mark the record breaking run for 400 th day. The movie ran four shows a day for 400 days in Mini Shiva theatre at Yemmiganur in Kurnool district which was a record of sorts considering the size of the town.
Please Wait while comments are loading...